Kerala Trekker Rescued Successfully: కేర‌ళ‌లోని ఒక కొండ చీలిక‌లో చిక్కుకున్న యువకున్ని ఎట్టకేలకు ఆర్మీ కాపాడింది. కేర‌ళ‌లోని పాల‌క్కాడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక కొండ చీలిక‌లో ఒక ఆర్‌ బాబు అనే యువ‌కుడు చిక్కుకుని దాదాపు రెండు రోజుల పాటు అలాగే ఉండిపోయాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ యువకుడిని ర‌క్షించేందుకు రంగంలోకి దిగిన ఆర్మీ.. ఈ రోజు ఉద‌యం మొదట అతనికి ఫుడ్‌, వాటర్‌‌ను అందించింది. ఆర్. బాబు తన స్నేహితులతో క‌లిసి మలంపుజాలోని చేరాడ్ కొండ ప్రాంతానికి ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. అయితే కొద్ది దూరం వెళ్లాక బాబు.. స్నేహితులు కొండను అధిరోహించే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కానీ బాబు మాత్రం అలాగే ఎక్కుతూ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతను కాలు జారి కిందపడిపోయాడు. దీంతో కొండ‌ల మధ్య ఉన్న చిన్నపాటి చీలిక ప్ర‌దేశంలో చిక్కుకుపోయాడు.


ఇక ఇది గమనించిన అత‌డి స్నేహితులు అతన్ని కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో అక్కడి నుంచి కింద వచ్చేసిన బాబు స్నేహితులు ఈ విషయాన్ని అక్కడున్న స్థానికులకు వివరించారు.


త‌ర్వాత కోస్ట్‌ గార్డ్ రంగంలోకి దిగి యువకుడిని కాపాండేందుకు ప్రయత్నించింది. అయితే వారు హెలికాప్ట‌ర్‌తో కూడా అతన్ని కొండ చీలిక నుంచి బయటికి తీసుకురాలేకపోయారు. ఇక ఈ విషయం కేర‌ళ సీఎం విజ‌య‌న్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన ఆర్మీ స‌హాయం కోరారు. 



 


బుధవారం రెండు ఆర్మీ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఈ బృందాల్లో పర్వతాల అధిరోహణలో ప్రత్యేక స్కిల్‌ కలిగిన సైనికులు ఉన్నారు. అలాగే పారాచ్యూట్ రెజిమెంట్‌కు చెందిన ఆర్మీ బృందం కూడా అక్కడికి చేరుకుంది. మొదట డ్రోన్స్ సాయంతో యువకుడి జాడను గుర్తించి అతడికి ఫుడ్‌ అందించారు. తర్వాత కొండ చీలిక నుంచి యువకుడిని ఆర్మీ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డ బాబు ఆనందానికి అవధుల్లేవు.


Also Read: IND vs WI 2nd ODI: టీమిండియాదే బ్యాటింగ్.. రాహుల్ ఆయేగా! ఓపెనర్‌గా టీమిండియా కొత్త ప్రయోగం!!


Also Read: Wedding Dance Video: పెళ్లిలో కూడా 'ఊ అంటావ మావ.. ఉఊ అంటావా మావా' గొడవేనా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook