Nipah Virus: కరోనా వైరస్ మహమ్మారితో విలవిల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి మరో భయం పట్టుకుంది. రాష్ట్రంలో తాజాగా నిఫా వైరస్ వెలుగు చూసింది. నిఫా వైరస్ కారణంగా ఓ బాలుడి మృతి చెందడం ఆందోళన రేపుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సంక్రమణ (Corona Spread)ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో విజృంభిస్తోంది. రోజుకు 30 వేల కేసులు వెలుగు చూస్తుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఈ నేపధ్యంలో కేరళలో మరో భయం వెంటాడుతోంది. కొత్తగా రాష్ట్రంలో నిఫా వైరస్ వెలుగు చూడటమే కాకుండా 12 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో కలకలం రేగుతోంది. కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 12 ఏళ్ల బాలుడు ఈ నెల 3వ తేదీన చేరాడు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.  బాలుడి నుంచి సేకరించిన శాంపిల్‌ను పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించగా.నిఫా వైరస్ పాజిటివ్‌గా తేలింది. నిఫా వైరస్ కారణంగానే బాలుడు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 


బాలుడి కుటుంబంలో మరెవరికీ నిఫా వైరస్(Nipah Virus)లక్షణాలు లేవని తెలిసింది. ఇంట్లో కుటుంబసభ్యులంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. కోజికోడ్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు అధికారుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాలుడితో కాంటాక్ట్‌లో ఉన్నవారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. నిఫా వైరస్ కారణంగానే మరణించాడని ధృవీకరించిన కేంద్ర ప్రభుత్వం(Central government)..నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందాన్ని కోజికోడ్ పంపించింది. దేశంలో మొదటిసారిగా నిఫా వైరస్ కేసు..ఇదే జిల్లాలో 2018లో తొలిసారిగా నమోదైంది. 


Also read: India on Afghan Issue: భారత ఆందోళనలపై తాలిబన్ల సానుకూల స్పందన ఎంతవరకు నిజం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook