India on Afghan Issue: ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై ప్రపంచ దేశాల ఆందోళన ఓ వైపు, భారతదేశం ఆందోళన మరోవైపు ఉన్నాయి. ఈ నేపధ్యంలో భారత్ పట్ల తాలిబన్లు సానుకూలంగా స్పందించనున్నారని తెలుస్తోంది. భారత విదేశాంగ కార్యదర్శి ఈ అంశంపై మాట్లాడారు.
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు(Talibans)వశపర్చుకున్న క్రమంలో అక్కడి పరిణామాలపై ఇండియా సహా ప్రపంచదేశాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఇండియాకు పక్కలో బల్లెంగా మారిన చైనా, పాకిస్తాన్ దేశాలు ఆ దేశంలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న వార్తలు ఇండియా ఆందోళనను మరింతగా పెంచింది. ఈ క్రమంలో భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇండియా అమెరికా మధ్య నాలుగవ వార్షిక ద్వైపాక్షిక చర్చలు వాషింగ్టన్‌లో జరగనున్నట్టు తెలిపారు.
ఆఫ్ఘన్ పరిణామాలపై భారతదేశం ఆందోళనల పట్ల సానుకూలంగా వ్యవహరించనున్నట్టు తాలిబన్లు సంకేతాలిచ్చారని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan) పాకిస్తాన్ చర్యల్ని ఇండియా, అమెరికా దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. మూడ్రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆప్ఘనిస్తాన్‌లో పరిస్థితులు ఇంకా కుదటుపడలేదన్నారు. ఆఫ్ఘన్ పరిణామాలపై అమెరికా వేచి చూస్తున్న విధానాన్నే ఇండియా కొనసాగిస్తుందన్నారు.తాలిబన్లతో ఇండియా సంబంధాలు పరిమితమేనని..ఇటీవల జరిగిన భేటీలో కూడా విస్తృత స్థాయి చర్చలు జరగలేదన్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాద అడ్డాగా మారుతుందేమోనన్న ఇండియా ఆందోళనపై తాలిబన్లు సానుకూలంగా స్పందించే సంకేతాలున్నాయన్నారు. ఐక్యరాజ్యసమితి(UNO)ఆంక్షల నేపధ్యంలో జైష్ ఎ మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా వంటి సంస్థలు ఆఫ్ఘనిస్తాన్‌లో స్వేచ్ఛగా ప్రవేశిస్తున్నాయన్నారు. ఆ దేశంలో ఏ విధమైన ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా తాలిబన్లదే బాధ్యతని హెచ్చరించారు.
Also read: Delhi Terror Attack: ఇండియాలో మరోసారి ఉగ్రదాడులకు అవకాశం, డిల్లీలోని ముఖ్య ప్రాంతాలు టార్గెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook