Gelatin Sticks Found in Sabarimala: కేరళలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శబరిమలలో (Sabarimala Temple) పేలుడు పదార్థాలు తీవ్ర కలకలం రేపాయి. శబరిమలకు వెళ్లే దారిలో పెన్ ఘాట్ బ్రిడ్జి వద్ద ఆరు జిలెటిన్ స్టిక్ (Gelatin Sticks) పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి. జిలెటిన్ స్టిక్స్ అక్కడ ఎవరు అమర్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న (Gelatin Sticks Found in Sabarimala) మార్గంలోనే శుక్రవారం (జనవరి 21) తిరువాభరణం (Tiruvabharanam) (అయ్యప్ప ఆభరణాల పెట్టె)ను తీసుకురావాల్సి ఉంది. పేలుడు పదార్థాల స్వాధీనంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది.


గత డిసెంబర్ 30న తెరుచుకున్న శబరిమల ఆలయం (Sabarimala Temple) ఇవాళ్టితో మూతపడనుంది. నేటితో 'మకరవిలక్కు' సీజన్ పూర్తవుతుండటంతో ఆలయాన్ని మూసివేయనున్నారు. తిరిగి వచ్చే ఫిబ్రవరి 12న ఐదు రోజుల పాటు ఆలయాన్ని తెరవనున్నారు. మకరవిలక్కు (Makaravilakku) ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న మకర జ్యోతి (Makara Jyothi) దర్శనం జరగ్గా... దాదాపు 70 వేల మంది భక్తులు జ్యోతి దర్శనం కోసం తరలివచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 


కరోనా వ్యాప్తి నేపథ్యంలో (Kerala Covid 19 Cases) తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఈసారి మకరవిలక్కు వేడుకలు నిర్వహించారు. అంతకుముందు, గతేడాది నవంబర్ 15 నుంచి డిసెంబర్ 27 వరకు మండల మరకవిలక్కు వేడుకలు నిర్వహించారు. మొత్తంగా గతేడాది శబరిమలకు రూ.78.92 కోట్ల ఆదాయం సమకూరింది. 2020తో పోలిస్తే ఇది తొమ్మిది రెట్లు ఎక్కువ.


Also Read: Video: ఒకరు చెట్టెక్కారు.. ఇంకొకరు సిబ్బందితో కలబడ్డారు.. వ్యాక్సిన్ వద్దంటూ హంగామా


Also Read: Covid 19 Endemic: ఎట్టకేలకు దేశ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కరోనా పీడ ఎప్పుడు విరగడైపోతుందో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook