Covid 19 Endemic: ఎట్టకేలకు దేశ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కరోనా పీడ ఎప్పుడు విరగడైపోతుందో తెలుసా?

దేశంలో కరోనా మార్చి 11 నాటికి ఎండమిక్‌ దశకు చేరుకుంటుందని ఐసీఎంఆర్‌ ఎపిడెమియోలాజికల్‌ విభాగం చీఫ్‌ సమీరన్‌ పాండా చెప్పారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 12:19 PM IST
  • ఎట్టకేలకు దేశ ప్రజలకు గుడ్‌ న్యూస్‌
  • కరోనా పీడ ఎప్పుడు విరగడైపోతుందో తెలుసా?
  • కరోనాకి అదే ముగింపు
Covid 19 Endemic: ఎట్టకేలకు దేశ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కరోనా పీడ ఎప్పుడు విరగడైపోతుందో తెలుసా?

Covid 19 may become endemic in India by March 11: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ (Covid 19) మహమ్మారి వణికిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత (India) దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూపోతున్నాయి. మొన్నటివరకు ప్రతిరోజు 2 లక్షల కొత్త కేసులు నమోదవుతే.. బుధవారం పాజిటివ్ కేసుల (Covid Positive Cases) సంఖ్య 3 లక్షల మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,17,532 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

కరోనా థర్డ్‌ వేవ్‌ (Covid Third Wave) కారణంగా అల్లాడిస్తున్న దేశ ప్రజలకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కోవిడ్‌ నిబంధనల్ని తప్పకుండా పాటిస్తే.. మరో రెండు నెలల్లో వైరస్ ఉదృతి తగ్గే అవకాశాలు ఉన్నాయట. దేశంలో కరోనా మార్చి 11 నాటికి ఎండమిక్‌ దశకు చేరుకుంటుందని ఐసీఎంఆర్‌లో ఎపిడెమియోలాజికల్‌ విభాగం చీఫ్‌ సమీరన్‌ పాండా (Samiran Panda) ఓ ప్రకటనలో చెప్పారు. ప్రజలందరూ మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులు కడుక్కోవడం వంటివి తప్పనిసరిగా చేస్తూ ఉంటే.. కొత్త వేరియంట్లు ఏవీ పుట్టుకొని రాకపోతే కరోనా తుది దశకు చేరుకున్నట్టేనని తెలిపారు.

Also Read: Anupama Parameswaran: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తోన్న అనుపమ.. మలయాళ బ్యూటీ అందానికి ప్రేక్షకులు ఫిదా!!

'డెల్టా వేరియంట్‌ స్థానాన్ని ఒమిక్రాన్‌ ఆక్రమిస్తే.. కరోనాకి అదే ముగింపు అవుతుంది. కొత్తగా ఏ వేరియంట్లు రాకపోతే.. ఇక కరోనా లేనట్టే. డిసెంబర్‌ 11 నుంచి మొదలైన కరోనా థర్డ్‌ వేవ్‌ మూడు నెలల్లో ముగిసిపోతుంది. మార్చి 11 నుంచి కరోనా ఉధృతి తగ్గిపోతుంది. ఢిల్లీ, ముంబైలలో కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయో లేదో  తెలియాలంటే.. మరో 2-3 వారాలు వేచిచూడాలి. ఆ నగరాల్లో పాజిటివిటీ రేటు తగ్గుతున్నప్పటికీ అక్కడ కరోనా పరిస్థితి ఏ దశలో ఉందో ఇప్పుడే చెప్పలేము. 1-2 రోజుల్లో అక్కడ పరిస్థితులపై ఒక అంచనాకి రాలేము' అని సమీరన్‌ తెలిపారు. 

'కరోనా పరీక్షలను తగ్గించవద్దని మేము రాష్ట్రాలకు ఎప్పుడూ చెప్పలేదు. కరోనా స్వభావం మారినప్పుడల్లా ఐసీఎంఆర్‌ కరోనా పరీక్షలు, నిర్వహణ వ్యూహాలను మార్చుకుంటూ ఉంటుంది. హోమ్ టెస్టింగ్ మొదలైన వాటిపై స్థానిక భాషల్లో మార్గదర్శకాలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. జెనోమిక్ సీక్వెన్సింగ్ ఒక డైనమిక్ ప్రక్రియ. చాలా మంది రోగులు అంతర్లీన పరిస్థితులతో మరణిస్తున్నారు. అందుకే ఆసుపత్రులలో ఇన్ఫెక్షన్ల తీవ్రతను అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేస్తున్నాము' అని సమీరన్‌ పాండా చెప్పుకొచ్చారు. 

Also Read: Cameron Boyce Double Hat-Trick: 4 బంతుల్లో 4 వికెట్లు.. డబుల్‌ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన ఆసీస్ బౌలర్‌!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News