Wayanad Tragedy: వయనాడ్ బాధితురాలు శ్రుతి జీవితంలో మరో ఘోరం.. అప్పుడు 9 మంది.. ఇప్పుడు కాబోయే భర్త..
Wayanad landslide: కేరళలోని వయనాడ్ లో సంభవించిన వరదల్లో వేలాది మంది తమ ప్రాణాల్ని కోల్పోయారు. ఇప్పటికి కూడా అక్కడివారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వయానాడ్ లో తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను శ్రుతి అనే యువతి కోల్పోయింది. ఈ ఘటనలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Wayanad landslide Kerala women Sruthi life tragedy: కేరళలోని వయనాడ్ లో ప్రకృతి ప్రకోపానికి వేలాదిగా అమాయకులు బలయ్యారు. ఇదిలా ఉండగా.. వయనాడ్ విలయంలో తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను శ్రుతి అనే యువతి కోల్పోయింది. ఆమెను ఓదార్చడం అక్కడున్న వారి కూడా సాధ్యపడలేదు.ఈ క్రమంలో ఆమె చిన్ననాటి మిత్రుడు.. మాత్రం శ్రుతికి అండగా నిలిచాడు. ఆమెకు తానున్నాని చెప్పిధైర్యం చెప్పాడు. దీంతో ఇద్దరు కలిసి కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకున్నారు.
మొదటి నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరు కూడా పెళ్లి బంధంతో ఒక్కటయ్యేందుకు కూడా ఏర్పాట్లలో ఉన్నారు. ఈ క్రమంలో అనుకొని ఘటన చోటు చేసుకుంది. జీవితాంతం తోడునీడగా ఉంటానంటూ మాటిచ్చిన కాబోయేవాడు.. రోడ్డు ప్రమాదం రూపంలో చనిపోవడం తీవ్ర విషాదకరంగా మారింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన ఆ యువతి బాధ వర్ణణాతీతంగా మారిందని చెప్పుకొవచ్చు
వయనాడ్ జిల్లా చూరాల్‌మల గ్రామానికి చెందిన శ్రుతి (24)కి చిన్ననాటి స్నేహితుడు జెన్సన్ (27)తో జూన్ 2న వివాహం నిశ్చయమైంది. ఇరువురి మతాలు వేరైనా ఇంట్లో వాళ్లు మాత్రం పెళ్లికి ఒకే చెప్పారు. కానీ.. జూన్ 30న ప్రకృతి విలయానికి శ్రుతి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. మెరుపు వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడిన ఘటనలో శ్రుతి తల్లిదండ్రులు, సోదరి సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కష్టకాలంలో.. శ్రుతికి జెన్సన్ అండగా నిలిచాడు.
సెప్టెంబర్‌లో తాము రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. కానీ.. శ్రుతికి కాబోయే భర్త జెన్సన్ (27) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సెప్టెంబర్ 10న శ్రుతి, జెన్సన్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు వాహనంలో వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యింది. కోజికోడ్-కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తోన్న ఓమ్మీ వ్యాన్, ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి.
Read more: Snake news: చేపను చూసి టెంప్ట్ అయిన పాము.. చూస్తుండగానే ఊహించని బిగ్ ట్విస్ట్.. ఎక్కడో తెలుసా..?
దీంతో.. జెన్సన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే.. గాయపడ్డ వారిని.. ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో జెన్సన్ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. జెన్సన్ ఆస్పత్రికి వచ్చినప్పుడు.. ముక్కు, మెదడు నుంచి తీవ్ర రక్తస్రావమైందని వైద్యులు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.