Bullet Train Projects: తెలుగు ప్రజలకు శుభవార్త. త్వరలోనే ప్రతిష్టాత్మక ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ అందుబాటులో రానుంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక భేటీ నేడు జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే బుల్లెట్ ట్రైన్లు (Bullet Trains)చాలా దేశాల్లో పరుగులెడుతున్నాయి. వీటిలో ఒకదానిమించిన మరొక రైళ్లున్నాయి. వేగంలో పోటీ పడుతూ ఉన్నాయి. ఇండియాలో ఇప్పుడిప్పుడే బుల్లెట్ ట్రైన్స్ పనులు ప్రారంభమయ్యాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల్ని వేగంగా నిర్మించేందుకు రైల్వేశాఖ నుంచి వేరు చేశారు. కొత్తగా నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా ఇండియాలో ముంబై-అహ్మదాబాద్ మద్య 508 కిలోమీటర్ల మేర ఇండియాలోని తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఇప్పటికే ముంబై - అహ్మదాబాద్(Mumbai-Ahmedabad Bullet Train) మార్గంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. దేశంలో ఇంకొన్ని ప్రాజెక్టులు చేపట్టాలనేది ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సి ఆలోచన. ఇందులో ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-అహ్మదాబాద్, చెన్నై-బెంగళురు-మైసూరు, ముంబై-హైదరాబాద్ మార్గాలున్నాయి. రానున్న రోజుల్లో బుల్లెట్ ట్రైన్ దూరాన్ని 4 వేల 109 కిలోమీటర్లకు పెంచాలనేది లక్ష్యంగా ఉంది. 


ఎన్‌‌హెచ్‌ఎస్‌ఆర్‌సి(NHSRC) సిద్ధం చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం ముంబై-హైదరాబాద్(Mumbai-Hyderabad Bullet Train) వరకూ మొత్తం 717 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మితం కానుంది. ఈ మార్గంలో మొత్తం 11 స్టేషన్లు ఉంటాయి. ముంబై, నవీ ముంబై ఎయిర్‌పోర్ట్, పూణే, లోనావాలా, పండరీపూర్, షోలాపూర్ వంటి స్టేషన్లు ఉంటాయి. ప్రస్తుతం ముంబై నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే కనీసం 15 గంటల సమయం పడుతోంది. బుల్లెట్ ట్రైన్ అందుబాటులో వస్తే ప్రయాణ సమయం కేవలం 3 గంటల 30 నిమిషాలకు పరిమితం కానుంది.  ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు కాగా..గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించేలా ట్రాక్ నిర్మిస్తారు. ఒకేసారి 350 మంది ఈ మార్గంలో ప్రయాణించవచ్చు. దేశంలో కొత్తగా ప్రతిపాదిస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినది ఇదొక్కటే. ఈ బుల్లెట్ రైలును ఏ మార్గంలో నిర్మించాలి, ఎంత ఖర్చవుతుంది, భూ సేకరణ ఎలా చేయాలనే అంశాలకు సంబంధించిన కీలకమైన సమావేశం ఇవాళ మహారాష్ట్రలోని థానేలో జరగనుంది. అహ్మదాబాద్-ముంబై తరహాలోనే ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును కూడా ఎలివేటెడ్ కారిడార్ పద్ధతిలోనే నిర్మించనున్నారు. మేజర్ ఎక్స్‌ప్రెస్ హైవేలు, నేషనల్ హైవేలు, గ్రీన్‌ఫీల్డ్ ఏరియా మీదుగా ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ఉండనుంది.


ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మధ్య దూరం 717 కిలోమీటర్లు కాగా, చెన్నై-బెంగళూరు-మైసూరు(Chennai-Bengaluru-Mysore Bullet Train) ప్రాజెక్టు మధ్య దూరం 435 కిలోమీటర్లుంది. ఇక ఢిల్లీ-వారణాసి మధ్య 865 కిలోమీటర్ల దూరం ఉండగా, ఢిల్లీ-అమృతసర్ మద్య 450 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక ఢిల్లీ -అహ్మదాబాద్ మధ్య 886 కిలోమీటర్ల దూరముంది.


Also read: Canada Lifts Ban: భారత విమానాలపై నిషేధాన్ని తొలగించిన కెనడా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook