Terrorists Plot For Bomb Blasts: దేశంలో ఏదో రకంగా విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏ కుట్ర కోణం బయటపడినా దాని వెనుక పాకిస్థాన్ హస్తం ఉంటోంది. తాజాగా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నాగం పన్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నించారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో నలుగురి ఖలీస్థానీ ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. పట్టుబడిన ఉగ్రవాదులకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో తెలంగాణ, పంజాబ్, హరియాణా పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. హరియాణాలోని కర్నాల్ ప్రాంతంలోని టోల్ ప్లాజా దగ్గర ఓ అనుమానిత ఇనోవా వాహనాన్ని ఆపి తనిఖీలు చేశారు. అందులో భారీగా ఆయుధాలు ఉన్నట్లు గుర్తించారు. 30 కాలిబర్ తుపాకీలు, ఐఈడీలు, ఆర్డీఎక్స్ కూడా లభ్యమైంది. ఆ వాహనంలో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నంచడంతో వారు పంజాబ్ కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాదులుగా గుర్తించారు. పట్టుబడిన ఆయుధాలను తెలంగాణతో పాటు మహరాష్ట్రకు తరలించాలని ఉగ్రవాదులు భావించినట్లు తేలింది.


భారీ ఆయుధాలు ఖలిస్థానీ ఉగ్రవాదులకు ఎలా వచ్చాయన్నది భద్రతా బలగాలు ఆరా తీయడంతో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఈ ఆయుధాలను డ్రోన్ల ద్వారా పాక్ సరిహద్దుల నుంచి తీసుకొచ్చినట్లు తేలింది. పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిందర్ సింగ్ రిందా వీటిని పంపినట్లు గుర్తించారు.


అదిలాబాద్‌కు భారీగా ఆయుధాలు


భారీగా ఆయుధాలను తరలించేందుకు ఖలిస్థాన్ ఉగ్రవాదులు తెలంగాణలోని అదిలాబాద్‌ను ఎంచుకోవడం కలకలం రేపుతోంది. హరియాణాలోని కర్నాల్ జిల్లా టోల్‌ ప్లాజా దగ్గర పట్టుబడిన కుల్‌ ప్రీత్, అమన్‌దీప్‌, పరిమిందర్‌, భూమేందర్‌ ఆయుధాల డంప్‌ కోసం నాందేడ్, అదిలాబాద్‌ జిల్లాలను ఎంచుకున్నట్లు ఎన్‌ఐఏ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంలో మూడు అంశాలు తెరపైకి వచ్చాయి. అదిలాబాద్ జిల్లా మీదుగానే 44 నంబర్ జాతీయ రహదారి ద్వారా ఢిల్లీకి చేరుకోవచ్చు... దీంతో పాటు నిర్మల్ జిల్లా భైంసా, నాందేడ్‌కు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకోవడానికి అనువైన మార్గం...ఇక మంచిర్యాల మీదుగా నేరుగా ఢిల్లీకి రైల్వే మార్గం ఉంది. అందుకే ఆర్డీఎక్స్‌ తదితర పేలుడు పదార్థాల నిలువకు అదిలాబాద్ జిల్లా అనువైన ప్రాంతంగా ఉగ్రవాదులు భావించారు.


ఎవరీ హర్జిందర్ సింగ్ రిందా ?


హర్జిందర్ సింగ్ రిందా పంజాబ్ లోని తర్న్‌ తరన్ జిల్లాకు చెందిన వాడు. రిందా కుటుంబం 11 ఏళ్ల వయసులోనే మహారాష్ట్రలోని నాందేడ్ కు మకాం మార్చింది. పోలీసు రికార్డ్స్ ప్రకారం రిందా 18 ఏళ్ల వయసులోనే కుటుంబగొడవల నేపథ్యంలో బంధువొకరిని హత్య చేశాడు.  ఆ తర్వాత స్థానిక వ్యాపారుల నుంచి దోపిడి మొదలు పెట్టి మరో ఇద్దరినీ మట్టుబెట్టాడు. హర్జిందర్ సింగ్ అలియాస్ రిందా సందు ప్రస్తుతం పాకిస్తాన్ లో తలదాచుకుంటున్నాడు. చండీఘర్ లో ఇతనిపై హత్య, హత్యాయత్నంతో పాటు నాలుగు  క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కేసులు 2016 నుంచి 2018 మధ్య రిజిస్ట్రర్ అయినవే. పోలీసుల విచారణలో రిందా నేపాల్ నుంచి నకిలీ ఇండియన్ పాస్ పోర్టుతో పాకిస్తాన్ చేరినట్టు తేలింది. ఇందతా పక్కన బెడితే రిందాపై ఇప్పుడు మహారాష్ట్రతో పాటు పంజాబ్ లో 12కు పైగా కేసులు ఉన్నాయి. 35 ఏళ్ల రిందా ఇప్పుడు లహోర్ లో తలదాచుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నవాన్షహర్ లో సీఐఏ ఆఫీస్ పై జరిగిన ఉగ్రదాడిలో ఇతడి పాత్ర ఉందని తెలుస్తోంది. పాకిస్తాన్ లోకి ఎంటరైన తర్వాత రిందా తన ఖలిస్తానీ టెర్రరిస్టులతో కలిసి పంజాబ్ లో మళ్లీ అలజడులు సృష్టించాలని కుట్ర పన్నినట్టు తెలుస్తోంది.


సరిహద్దుల్లో సొరంగం


మరోవైపు అమర్‌నాథ్ యాత్రను టార్గెట్ చేసిన పాక్ ఉగ్రవాదుల కుట్రను సరిహద్దు భద్రతా దళం భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్‌ లో ఇంటర్నాషనల్ బార్డర్‌ దగ్గర ఓ రహస్య  సొరంగాన్ని బీఎస్‌ఎఫ్ సిబ్బంది గుర్తించింది. సాంబా జిల్లాలోని చాక్ ఫఖీరా అవుట్‌పోస్ట్‌కు  సమీపంలో 150 మీటర్ల సొరంగం బయటపడింది.


అమర్‌నాథ్ యాత్రకు భగ్రం కలిగించేందుకు ఈ సొరంగం ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు సిద్ధమైనట్లు అధికారులు గుర్తించారు. జూన్ 30 నుంచి ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.


Also Read: Rahul in Night Club With Woman Fact: రాహుల్‌తో నైట్ క్లబ్‌లో ఉన్న మహిళ.. ఎవరో తెలిసిందా ?


Also Read: Prashant Kishor Comments: కొత్తపార్టీ పెట్టడం లేదన్న ప్రశాంత్‌ కిషోర్‌ - కొత్త ప్లానేంటో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook