కేరళలో ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్
కేరళ రాష్ట్రంలోని ఒక ప్రదేశంలో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కనిపించాడు. దాంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా అవాక్కయ్యారు
కేరళ రాష్ట్రంలోని ఒక ప్రదేశంలో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కనిపించాడు. దాంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. స్థానిక బీజేపీ నాయకులు కిమ్ జోంగ్ ఉన్ పై గుర్రుగా ఉన్నారు. ఏమిటీ? నమ్మశక్యంగా అనిపించడం లేదా? వివరాల్లోకి వెళితే..
కేరళ రాష్ట్రంలో ఒక ప్రదేశంలో సీపీఐ పార్టీ బ్యానర్లో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఫోటో కనిపించడంతో అక్కడున్నవారందరూ కలవరపడ్డారు. తొలుత ఫోటో చూడగానే వామ్మో.. కిమ్ జోంగ్ ఉన్ ఇక్కడకు వస్తున్నాడా? అని భావించారు. కానీ తేరుకొని అబ్బే.. అలాంటిదేమీ లేదులే.. అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ బీజేపీ మాత్రం ఇందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేసి వ్యంగ్యంగా పేర్కొనింది.
'కేరళలో హత్యలు జరుగుతున్నది బహుశా ఇందుకేనేమో.. సీపీఐ కిమ్ జోంగ్ ఉన్ తరహాలో అణుక్షిపణులతో బీజేపీ, ఆరెస్సెస్ కార్యాలయాలపై దాడులకు తెగబడదని ఆశిస్తున్నాం. బీజేపీ, ఆరెస్సెస్ ఆఫీసులపై అణు దాడులు చేయడం సీపీఐ తదుపరి ఎజెండా కాకుంటే బాగున్ను' అని తెలిపారు.