SBI New Rules: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఇక అదనపు ఛార్జీల మోత పడనుంది. ఎస్బీఐ సేవింగ్స్ ఖాతా మరింత ప్రియం కానుంది. కొత్త నిబంధనల్ని జూలై 1 నుంచి అమలు చేయనుంది. ఆ అదనపు ఛార్జీల వివరాలిలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అయిన ఎస్బీఐ కొత్త నిబంధనల్ని(SBI New Rules) అమలు చేస్తోంది. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లో వస్తాయని ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాలకు అదనపు ఛార్జీలు పడనున్నాయి. ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా, సంబంధిత బ్రాంచ్ నుంచి విత్ డ్రా, చెక్ బుక్ విత్ డ్రాయల్ అంశాల్లో ఛార్జీలు మారుతున్నాయి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు మాత్రమే వర్తించే ఈ కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమల్లో రానున్నాయి.


ఎస్బీఐ (SBI) కొత్త నిబంధనల ప్రకారం ఖాతాదారుడు ఏటీఎం ద్వారా నెలలో నాలుగు కంటే ఎక్కువ సార్లు నగదు విత్ డ్రా (Atm withdrawal charges)చేస్తే ఛార్జీలు పడనున్నాయి. ప్రతి అదనపు లావాదేవీపై 15 రూపాయలు ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లి నెలలో నాలుగు కంటే ఎక్కువసార్లు డబ్బులు డ్రా చేసినా అదే ఛార్జి పడుతుంది. ఇక ప్రతి ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ ఖాతాదారుడికి ఒక ఆర్ధిక సంవత్సరంలో పది చెక్ లీవ్స్ మాత్రమే ఇస్తుంది. అదనంగా కావాలంటే 40 రూపాయలు చెల్లించాలి. దీనికి జీఎన్టీ అదనం. ఇక 25 చెక్ లీవ్స్ కావాలంటే 75 రూపాయలు జీఎస్టీ అదనంగా చెల్లించాలి. ఎమర్జెన్సీ చెక్ బుక్ పది లీవ్స్‌తో కావాలంటే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క సీనియర్ సిటిజన్స్‌కు మాత్రం ఈ అదనపు ఛార్జీల్నించి మినహాయింపు ఇచ్చారు. ఎస్బీఐ కొత్త నిబంధనల ప్రకారం సేవింగ్స్ బ్యాంక్ ఖాతా(SBI Saving Account) మరింత ప్రియం కానుంది. 


Also read: Central government: కొత్త ఇళ్లు కొనాలనుకుంటున్నారా..అయితే మీకోసమే ఈ గుడ్‌న్యూస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook