Bank Holidays: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్. సెప్టెంబర్ నెలలో దాదాపు సగం రోజులు సెలవులే ఉన్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 క్లోజింగ్ డేస్ ఉన్నాయని ఆర్బీఐ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీకు వచ్చే నెలలో అంటే సెప్టెంబర్ నెలలో బ్యాంకు పనులేమైనా ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి. లేదంటే సెప్టెంబర్ నెలలో ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు 12 సెలవులున్నాయని ఆర్బీఐ(RBI) వెల్లడించింది. రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలు, వివిధ రాష్ట్రాల పండుగలు కలిపి ఏకంగా 12 రోజులున్నాయి. ఆర్బీఐ సాధారణంగా తన సెలవులను మూడు కేటగిరీలుగా విభజిస్తుంది.నెగోషిబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌, హాలీడే అండర్‌ నెగోషిబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌, రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం బ్యాంకులకు సెలవుల్ని నిర్ధారిస్తుంది. ఈ సెలవులిలా(Bank Holidays) ఉన్నాయి.సెప్టెంబర్ 8న తిథి ఆఫ్ శ్రీమంత మహాదేవ, సెప్టెంబర్ 9వ తేదీన తీజ్,సెప్టెంబర్ 10న గణేశ్ చతుర్ధి, సెప్టెంబర్ 17న కర్మపూజ, సెప్టెంబర్ 21న శ్రీ నారాయణగురు సమాధి డేతో పాటు రెండవ, నాలుగవ శనివారాలు సెలవులున్నాయి. ఇందులో గణేశ్ చతుర్ధి పండుగనాడు మాత్రమే దేశవ్యాప్తంగా ప్రభావం పడనుంది. మిగిలినవాటిలో రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలు మినహాయిస్తే మిగిలినవన్నీ..ఇతర రాష్ట్రాలకు సంబంధించినవే. 


సెప్టెంబర్ 5, 11, 12, 19, 25, 26 తేదీల్లో రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాల కారణంగా బ్యాంకులు(Bank Holidays)పనిచేయవు. మిగిలిన రోజుల్లో కొన్ని ఇతర రాష్ట్రాల్లో పండుగలైతే..సెప్టెంబర్ 11న వినాయక చవితి(Vinayaka Chavithi) సందర్భంగా సెలవులున్నాయి. 


Also read: ICGS Vigraha Ship : భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..తీర భద్రత కోసం 'విగ్రహ'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook