ICGS Vigraha Ship : భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..తీర భద్రత కోసం 'విగ్రహ'

icgs vigraha ship: భారత తీరగస్తీదళం అమ్ముల పొదిలో మరో అధునాతన నౌక చేరుతోంది. అడ్వాన్స్‌డ్‌ ఫైర్‌ పవర్‌తో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐసీజీఎస్‌ విగ్రహ నౌకను శనివారం చెన్నైలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌ జాతికి అంకితం చేయనున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2021, 06:18 PM IST
  • కోస్ట్‌గార్డ్‌ అమ్ములపొదిలో ఆఫ్‌షోర్‌ పెట్రోల్‌ వెసల్‌
  • రేపు జాతికి అంకితం చేయనున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
  • విశాఖ కేంద్రంగా విధుల్లో విగ్రహ నౌక
ICGS Vigraha Ship : భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..తీర భద్రత కోసం 'విగ్రహ'

icgs vigraha ship: భారత  కోస్ట్‌గార్డ్‌  బలం రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా భారత తీర గస్తీదళం అమ్ముల పొదిలో మరో అధునాతన నౌక చేరుతోంది. ఇది చాలా ప్రత్యేకమైంది. అడ్వాన్స్‌డ్‌ ఫైర్‌ పవర్‌తో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐసీజీఎస్‌ విగ్రహ నౌకను (icgs vigrha  ship) చెన్నైలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌  (Rajnath singh)రేపు జాతికి అంకితం చేయనున్నారు.
ఆఫ్‌షోర్‌ పెట్రోల్‌ వెసల్‌ సిరీస్‌లో ఏడో నౌక అయిన విగ్రహని చెన్నైలోని ఎల్‌ అండ్‌ టీ షిప్‌ బిల్డింగ్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్మించింది. ఈ నౌక కోస్ట్‌గార్డు ఈస్ట్రన్‌ సీబోర్డు ప్రధాన స్థావరమైన విశాఖపట్నం (viskhapatnam) నుంచి ఈ విగ్రహ కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది.

ఐసీజీఎస్‌ విగ్రహ చేరడంతో.. కోస్ట్‌గార్డ్‌(Coast Guard) జాబితాలో నౌకల సంఖ్య 157కు చేరుతుంది. మరోవైపు మన కోస్ట్‌గార్డ్‌కు 66 విమానాలున్నాయి.పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐసీజీఎస్ విగ్రహ నౌక అధునాతన సాంకేతిక వసతులున్నాయి. దీని పొడవు 98 మీటర్లు, వెడల్పు 15 మీటర్ల, 3.6 మీటర్ల డ్రాట్‌తో ఉంది.  ఈ విగ్రహ బరువు 2,200 టన్నులు. 9,100 కిలోవాట్స్‌ డీజిల్‌ సామర్థ్యం ఉన్న రెండు ఇంజిన్లున్నాయి. 26 నాటికల్‌ మైళ్ల వేగంతో 5 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు. 

Also Read:Helicopter: ఛీప్ గా హెలికాప్టర్.. ఏకంగా రూ.26 కోట్లు డిస్కౌంట్..ఎక్కడంటే?

అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ రాడార్లు, నేవిగేషన్, కమ్యూనికేషన్‌ పరికరాలు, సెన్సార్లు, సముద్ర స్థితిగతులకు అనుగుణంగా దిశను మార్చుకునే యంత్ర సామర్థ్యం ఈ విగ్రహ(icgs vigrha  ship) సొంతం. 40/60 బోఫోర్స్‌ గన్, ఫైర్‌ కంట్రోల్‌ సిస్టమ్‌తో 12.7 మిల్లీమీటర్ల స్టెబిలైజ్డ్‌ రిమోట్‌ కంట్రోల్‌ గన్‌లు రెండు ఉన్నాయి.  రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడేలా ఒక ట్విన్‌ ఇంజిన్‌ హెలికాప్టర్, నాలుగు హైస్పీడ్‌ బోట్లు తీసుకెళ్లగలదు. సముద్రంలో చమురుతెట్టు వంటి కాలుష్యాల నియంత్రణకు స్పందించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఈ నౌకలో ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News