Kolkata doctor murder case mob vandalised hospital murder crime scene video viral: వెస్ట్ బెంగల్ లోని కోల్ కత్తాలో ట్రైయినీ వైద్యురాలిపై జరిగిన ఘటన దేశంలో సంచలనంగా మారింది. ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ పై హత్యచారం జరిగింది. యువవైద్యురాలు రాత్రి పూట నైట్ షిఫ్ట్ లోఉండగా.. ఆమెపై తెల్లవారు జామున 3 గంటలోప్రాంతలో అత్యాచారం , ఆపై హత్య చేసినట్లు బైటపడింది. తొలుత ఈ ఘటనను సూసైడ్ గా భావించారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. యువతిని అత్యంత దారుణంగా అత్యాచారంచేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. యువతి శరీరంలో.. 150 ఎంఎల్ లో వీర్యం ఉందని వైద్యులు తమ పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అంతేకాకుండా.. ఆమె గొంతుకు చెందిన ఎముక విరిగిపోయిందని కూడా చెప్పారు. ఆమె కళ్లనుంచి, నోటి నుంచి రక్తంబైటపడ్డట్లు తెలుస్తోంది. యువతికి అంతర్గంతంగా అనేక అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయని  కూడా పోస్ట్ మార్టంలో రిపోర్ట్ లో బైటపడింది. దీంతో  ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది.  దీనిపై దేశ వాప్తంగా మెడికోలు తమ నిరసలను తెలియజేస్తున్నారు.  ఇప్పటికి ఒక నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.


నిందితుడిని కఠినంగా పనిష్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ నాయకులు, సిని రంగ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. మరో నిర్భయ ఘటన అంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  యువతిని అత్యంత పాశావికంగా దాడులు చేసి, హత్య చేసినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బైటపడింది.  ఇదిలా ఉండగా.. దేశంలో ఒకవైపు ఇండిపెండెన్స్ వేళ.. కోల్ కతా ఘటన మాత్రం తీవ్ర దుమారంగా మారింది.


ఇదిలా ఉండగా..  కోల్ కతాలోని .. ఆర్ జీ కర్ ఆస్పత్రిపై అర్ధరాత్రిపై మూకదాడి జరిగింది. వందల సంఖ్యలు అల్లరి మూకలు ఆస్పత్రికి చేరుకుని, అక్కడి ఫర్నీచర్ నుధ్వంసం చేశారు. ఆస్పత్రిలో అల్లకల్లోలం క్రియేట్ చేశారు. దాదాపుగా.. ఆస్పత్రిలోతిరుగుతూ వస్తువుల్ని చిందరవందరగా పడేశారు.ఈ ఘటన పట్ల ప్రస్తుతం ఆస్పత్రిలోని వైద్యులు మాత్రం మరోలా  స్పందిస్తున్నారు.


Read more: Smita Sabharwal: ఇండిపెండెన్స్  డే సెలబ్రేషన్స్.. మరోసారి ఆసక్తికరంగా మారిన స్మితా సబర్వాల్ ట్విట్..  


ఆర్ జీ ఆస్పత్రిలో అల్లరి చేసిన వాళ్లు స్టూడెంట్ లు కాదని, కేవలం.. యువతి హత్యచారం జరిగిన ప్రదేశంలో క్లూస్ ను చేరిపేసుందుకు కొంతమంది కావాలని మూకుమ్మడిగా వచ్చారని అక్కడి డాక్టర్లు అన్నారు.  ఈ అల్లరి మూకల వల్ల.. ప్రూఫ్స్ లు కూడా తారుమారు చేశారన్నారు.  ఆర్ జీ కర్ ఆస్పత్రిలో ప్రవేశించి అల్లరి మూకలు చేసిన అల్లకల్లోలంకు చెందిన వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు కోల్ కతాల్లో ఆర్ జీ  కర్ లో విధ్వంసం చేసిన ఫోటోలను విడుదల చేశారు.  వీరిలో.. ఉన్న వారిని గుర్తించి దగ్గరలోని పోలీసులకు  వారివివరాలు వెల్లడించాలని ఒక ప్రకటనలో కోరారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter