Kolkata doctor rape murder case accused Sanjay Roy is a Sexual Pervert with animal instincts CBI Probe: కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్యచార ఘటన దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా ఈ ఘటనపై  దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కోల్ కతా హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుడు సంజయ్ రాయ్ కు సీబీఐ సైకోఅనాలిసిస్ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనికోసం కోల్ కతా నుంచి ప్రత్యేక సిబ్బంది వచ్చారు. అయితే.. నిందితుడు సంజయ్ రాయ్ అత్యంత వికృతమైన లైంగిక అలవాట్లు కల్గి ఉన్న విషయం బైటపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Badlapur News ఉలిక్కి పడిన బద్లాపూర్.. నర్సరీ బాలికలపై వాష్ రూమ్ లో అత్యాచారం.. రంగంలోకి ఎన్ హెచ్ఆర్సీ..


అంతేకాకుండా.. అతను జంతువుల కన్నా.. హీనంగా ప్రవర్తించేవాడని, పోర్న్ వీడియోలు చూడటానికి అలవాటు పడి, దారుణంగా ప్రవర్తించేవాడనే విషయం కూడా బైటపడింది. అతను అధికారులు టెస్టులు చేస్తున్నప్పుడు ఏ మాత్రం.. తప్పు చేసినట్లు బాధపడకుండా.. మాట్లాడినట్లు తెలుస్తోంది. అతనిలో ఎలాంటి పశ్చాత్తాప భావన కూడా లేదని తెలుస్తోంది. దీంతో అతని మాటలు విన్న అధికారులు సైతం.. విస్తుపోయారంట.


ఈ నేపథ్యంలో అతని వద్ద నుంచి స్టేట్ మెంట్ ను రికార్డును చేసిన పోలీసులు సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టు ధర్మాసం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు  ఘటన జరిగిన ముందు రోజు రాత్రి.. నిందితుడు వేశ్యలు ఉండే చోటకు వెళ్లినట్లు కూడ తెలుస్తోంది.


ఈ రోజు ఈ ఘటనపై మరోసారి సుప్రీంకోర్టులో వాదనలు నడవనున్నాయి.  చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తోపాటు, జస్టిస్ జేడీ పార్థీవాలా, మనోజ్ మిశ్రా తో కూడిన బెంచ్ ఆగస్టు 20 న ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు ఘటనపై తీవ్రంగా పరిగణించింది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులు, ఆర్ జీ కర్ ఆస్పత్రిపై కూడా కోర్టు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.  


Read more: Chiranjeevi Birthday Special: మెగాస్టార్ డైరెక్షన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా


పోలీసులు కేసునమోదుకు ఆలస్యం చేయడం, క్రైమ్ జరిగిన ప్రదేశాన్ని పోలీసులు ఎందుకు సీల్ చేయలేదని ఫైర్ అయ్యింది. ఆర్ జీ కర్ ఆస్పతిలో.. దుండగులు ప్రవేశించి అల్లర్లు జరిగితే.. సర్కారు వైఫల్యం కూడా ఉందని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


అదే విధంగా.. ఈ ఘటనను ఆత్మహత్య అనడం, ఆ తర్వాత యువతి పేరు ప్రస్తావించడం, ఫోటోలు పత్రికల్లో ప్రచురించడం పట్ల కూడా ధర్మాసనం సీరియస్ గా వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ నేపథ్యంలో..  ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో, తదుపరి నిర్ణయం ఏంతీసుకుంటుందో అని సర్వాత్ర ఆసక్తి నెలకొంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter