Indra Re Release: మెగాస్టార్ పుట్టినరోజు అంటే మెగా అభిమానులు పెద్ద పండుగలా జరుపుకుంటారు. పైగా ఈ సంవత్సరం చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఈసారి సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకోబోతున్నారు మెగా అభిమానులు. ఈ సందర్భంగా థియేటర్లో సందడి చేయడానికి చిరంజీవి ఇంద్ర సినిమా ఆగస్టు 22న రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంద్ర సినిమా మెగాస్టార్ అభిమానులకు ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఈ చిత్రానికి మరొక ప్రత్యేకత ఉంది అన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ఇంద్ర మూవీలో మెగాస్టార్ కేవలం హీరో పాత్రకే పరిమితం కాకుండా డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. అయితే మొత్తం సినిమాకి కాదు.. మూవీలో వచ్చే ఫ్లాష్ బాక్ సన్నివేశాలకు మెగాస్టార్ స్వీయ దర్శకత్వం చేశారట. మరి ఆ సీన్లు ఏమిటో తెలుసుకుందాం పదండి..
డైరెక్టర్ చిరు:
ఇంద్ర సినిమాలో ఎన్నో సన్నివేశాలు మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. మరి ముఖ్యంగా ఫ్లాష్ బాక్లో జరిగిన సన్నివేశాలు ఈ మూవీకి హైలైట్‌గా నిలిచాయి. అయితే ఈ సన్నివేశాలకు దర్శకుడిగా మెగాస్టార్ వ్యవహరించారు అన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. ఇంద్ర సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ బీ గోపాల్ జూనియర్ ఎన్టీఆర్.. నటిస్తున్న అల్లరి రాముడు మూవీ సాంగ్స్ షూటింగ్ కోసం స్విజర్లాండ్‌కి వెళ్ళవలసి వచ్చింది. అయితే ఆ సమయంలో షూటింగ్ ఆగిపోకుండా చిరంజీవి స్వయంగా ఫ్లాష్ బాక్ సన్నివేశాలను డైరెక్ట్ చేశారు. మనం ఫ్లాష్ బాక్లో చూసే హోమం సీన్, ఆ తర్వాత వచ్చే సాంగ్ ఎపిసోడ్ మొత్తాన్ని చిరు స్వయంగా డైరెక్ట్ చేశారు. ఈ విషయాన్ని నటుడు రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.
అంతేకాదు ఈ హోమం సీన్ షూటింగ్ మే నెలలో జరిగింది. ఒక్క నిమిషం కూడా నిలబడలేని ఎండలో ఒంటిమీద చొక్కా కూడా లేకుండా కేవలం ఒక టవల్ వేసుకుని 29 రోజుల పాటు చిరంజీవి హోమగుండం ముందు కూర్చుని తీసే ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులతో.. సినిమా షూటింగ్ లేట్ అవుతుంది అని ఇలా మండుటెండలో కూడా మీ దగ్గర షూటింగ్ చేయించాను.. క్షమించండి అని చిరంజీవి అన్నారట.
నిజానికి ఇంద్ర సినిమాలో ఫ్లాష్ బాక్లో జరిగిన సన్నివేశాలు సినిమా విజయంలో అవి కీలక పాత్ర పోషించాయి. మరీ ముఖ్యంగా హోమం సన్నివేశం, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్ వచ్చే సీన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అలాంటి బ్లాక్ బస్టర్ సీన్స్‌ను చిరంజీవి డైరెక్ట్ చేశారు అంటే ఆశ్చర్యంతో పాటు ఆయన డెడికేషన్ పై గౌరవం కూడా కలుగుతుంది.
Also Read పుట్టినరోజున సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి..
Also Read: ఏపీలో ఘోర విషాదం.. 18కి చేరిన మృతులు.. మరింత పెరిగే అవకాశం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter