Kolkata doctor rape-murder case sc hearing: కోల్ కతా డాక్టర్ ఘటన ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తుందని చెప్పుకొవచ్చు. ఈ ఘటనపై ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కల్గజేసుకుని సుమోటోగా కేసును తీసుకుంది. ఆగస్టు 9 న ట్రైనీ డాక్టర్ సెమినార్ హల్ లో విగత జీవిగా కన్పించింది. ఆ తర్వాత ఆర్ జీ కర్ ఆస్పత్రి సిబ్బంది ఆత్మహత్య ఘటనగా ప్రకటించారు. ఆతర్వాత కొన్ని గంటల వరకు కూడా యువతి డెడ్ బాడీని కనీసం వాళ్ల తల్లిదండ్రులకు కూడా చూసేందుకు అవకాశం ఇవ్వలేదు. అంతేకాకుండా యువతి.. డెడ్ బాడీ మీద అంతగా గాయలున్న కూడా.. ఆత్మహత్యగా ప్రకటించడం వెనుక కూడా తీవ్ర నిరసలను వెల్లువెత్తాయి. డెడ్ బాడీకి అంతిమ సంస్కారాలు పూర్తైన తర్వాత ఎఫైఐఆర్ నమోదు చేయడం, క్రైమ్ సీన్ ను దాదాపు.. 18 గంటల తర్వాత సీల్ చేయడం పట్ల కూడా సుప్రీంకోర్టు సీరియస్ గా వ్యాఖ్యలు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలో డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని.. జస్టిస్ పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన అత్యున్నత ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 20 న  సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఘటనపై దీదీ సర్కారు, కోల్ కతా పోలీసులు, ఆర్ జీ కర్ ఆస్పత్రిపై కూడా మండిపడింది. ఘటనపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేస్తున్న నేపథ్యంలో పూర్తి వివరాలతో తమ ముందు పిటిషన్ దాఖలు చేయాలని చెప్పింది.


ఇదిలా ఉండగా.. ఈ రోజు సుప్రీంకోర్టులో డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మరొసారి కేసును విచారించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐ సుప్రీంముందు స్టేటస్ రిపొర్టును సమర్పించింది. ఈ ఘటనతర్వాత ఐదురోజులకు సీబీఐకు అప్పగించారు. అప్పటి వరకు కేసుకు సంబంధించిన క్రైమ్ సీన్ ను తారుమారు చేసినట్లు కూడా సీబీఐ తరపు లాయర్ ధర్మసనం ముందు తమ వాదనలు విన్పించారు. అంతేకాకుండా.. గత 30 ఏళ్లలో..ఇలాంటి లోపాలను ఎప్పుడుచూడలేదంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యనిచ్చింది.ఈ నేపథకయంలో కోల్ కతా సర్కారుపై, పోలీసులపై, న్యాయవాదులపై కూడా తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. 


151 ఎంజీ పోస్ట్ మార్టంపై ఫైర్ అయిన డీవై చంద్రచూడ్..


ఈరోజు కేసు విచారణలో భాగంగా డీవై చంద్రచూడ్ ధర్మాసనం.. జూనియర్ డాక్టర్ శరీరంలో.. 151 మిగ్రాముల వీర్యంఉన్న ఆరోపణల్ని ధర్మాసనం తోసిపుచ్చింది. కోర్టులో వాదనలకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలను ఆధారంగా తీసుకొవద్దని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఘటన మరో ట్విస్ట్ చోటుచేసుకుందని చెప్పుకొవచ్చు. ఇక సీబీఐ కూడాతన రిపోర్టులో.. ఈ అత్యాచారం ఘటన గ్యాంగ్ రేప్ కాకపోవచ్చని కూడా వ్యాఖ్యలు చేసింది. 


గతంలో జూనియర్ డాక్టర్ అత్యాచారం తర్వాత.. యువతి శరీరంలో దాదాపు.. 151 ఎంఎల్ ల వీర్యం ఉన్నట్లు నాలుగు పేజీల పోస్టు మార్టం రిపోర్టును సీబీఐకు అప్పగించారు. అంతేకాకుండా.. యువతి శరీరంపై ఉన్న గాయాలు. కళ్లు,నోటిలో నుంచి బ్లీడింగ్, ఆమె మెడ దగ్గరలో ఉన్న ఎముకలు పూర్తిగా పట్టేసినట్లు ఉండటం కూడా ఆందోళన కల్గించే అంశంగా మారింది.


Read more: Kolkata Doctor murder: క్రైమ్ సీన్ మొత్తం మార్చేశారు.. సుప్రీం కోర్టు ఎదుట సంచలన విషయాలు బైటపెట్టిన సీబీఐ..


అంతేకాకుండా.. యువతి అంతర్గతంగా కూడా అవయవాలు డ్యామెజ్ కు గురైనట్లు కూడా వైద్యులుపోస్టు మార్టం రిపోర్టులో వెల్లడించారు. ప్రస్తుతం సీబీఐ, సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యల  పట్ల మాత్రం జూనియర్ డాక్టర్ కుటుంబ సభ్యులు, జూనియర్ డాక్టర్ లు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విధుల్లో చేరాలని కూడా సుప్రీంకోర్టు జూనియర్ డాక్టర్లను ఆదేశించింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter