man assulted women during Kolkata doctor murder case protest: కోల్ కతాలో మహిళలపై దారుణాలు మాత్రం ఆగడంలేదు. ప్రతిరోజు మహిళలపై వేధింపులు ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటన అత్యాచారం, హత్య ఘటన పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై అన్ని వర్గాల ప్రజల నుంచి నిరనసలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా బాధిత డాక్టర్ కు న్యాయం జరగాలని, దీని వెనుక ఉన్న ఎవరినైన కూడా కఠినంగా పనిష్మెంట్ చేయాలని కూడా డిమాండ్ లు వెల్లువెత్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా..  వెస్ట్ బెంగాల్ లో ట్రైనీ డాక్టర్ ఘటనను సుప్రీంకోర్టు సైతం సుమోటోగా స్వీకరించింది. అంతేకాకుండా దీనిపై లోతుగా విచారణ చేపట్టింది. మరోవైపు డాక్టర్ లు మాత్రం ఈ ఘటనపై బాధితురాలికి న్యాయం చేయాలంటూకూడా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిజయేస్తున్నారు. ఈ క్రమంలో కోల్ కతాలో ఆదివారం రోజు ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అమ్రాతిలోత్తమకు చెందని మహిళలు, కోల్ కతా ఘటనకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. అప్పుడు అనుకొని ఘటన చోటు చేసుకుంది. 


పూర్తి వివరాలు..


కొంత మంది మహిళలు ఆదివారం నాడు.. ట్రైనీ డాక్టర్ కు న్యాయం చేయాలంటూ కూడా నిరసనలకు దిగారు. అప్పుడు అనుకొని ఘటన చోటు చేసుకుంది. ఒక ఆగంతకుడు నిరసనలు తెలియజేస్తున్న మహిళ పట్ల రెచ్చిపోయాడు.  ఆమెను అసభ్యంగా తాకుతూ నీచంగా ప్రవర్తించాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా సదరు యువతి షాక్ కు గురైంది. వెంటనే ఆమె తన తోటి వారికి జరిగిన ఘటన చెప్పింది. వెంటనే స్థానికులతో కలిసి అతగాడికి దేహశుద్ది చేశారు. అంతేకాకుండా.. పోలీసులకు అప్పగించారు. కానీ పోలీసులు మరల అతడ్ని వదిలేశారు.


ఈ నేపథ్యంలో ఆగ్రహించిన నిరసన కారులు.. ర్యాలీగా డీసీపీ కార్యాలయానికి వెళ్లి పోలీసు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కానీ పోలీసులు మాత్రం.. అతను మానసికంగా సరిగ్గాలేని వ్యక్తి అంటూ కొంత మంది అంటున్నారు.ఈ ఘటన పట్ల బాధితులు రాలు మాత్రం పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ఇటీవల వెస్ట్ బెంగాల్లోని ఒక హెల్త్ సెంటర్ లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పెషెంట్.. సెలైన్ ఎక్కిస్తున్న నర్సు ప్రైవేట్ పార్ట్స్ లను టచ్ చేస్తు దారుణంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. 


Read more: Cm Revanth reddy: వరదల్లో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..   



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.