దేశవ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
దేశవ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో వైష్ణవ ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. దేశంలోని ప్రముఖ దేవాలయాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మథుర, మాయాపూర్‌లలో భక్తుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి సందర్భంగా దహీ హండీ(ఉట్టికొట్టడం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇస్కాన్ ఆలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాత్రంతా భజనలతో పాటూ, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలలో తెల్లవారుఝాము నుంచే భక్తుల తాకిడి మొదలైంది. తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. యాదాద్రిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. హారతి, భజన, తులసి పూజ, పుష్పార్చన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.