Shiv Sena MP Sanjay Raut slammed on some Rajya Sabha MPs ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో పలువరు ఎంపీలు.. క‌రోనా నియంత్ర‌ణ‌లో మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌య్యింద‌ని.. విమర్శలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలను శివ‌సేన నేత‌, రాజ్యసభ సభ్యుడు సంజ‌య్ రౌత్ (Sanjay Raut) తిప్పికొడుతూ గురువారం రాజ్యసభలో పలు ప్రశ్నలను సంధించారు. తనతల్లి, సోదరుడు కూడా కరోనా బారిన పడ్డారని.. మహారాష్ట్రలో చాలామంది కరోనా నుంచి కోలుకుంటున్నారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఒక‌ప్పుడు మహారాష్ట్రలోనే అత్య‌ధిక కేసులు ముంబై మురిక‌వాడ ధారావిలో నమోదయ్యాయని.. అక్కడ క‌రోనా నియంత్ర‌ణ కాలేదా అంటూ..? ఆయన పలువురు ఎంపీలను ప్ర‌శ్నించారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం ముంబై ధారావిలో చేపట్టిన చర్యల విషయంలో ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌ను (BMC) ప్ర‌శంసించింద‌ని గుర్తుచేశారు. క‌రోనాను అదుపు చేయ‌క‌పోతే ఇంత‌మంది ఎలా కోలుకున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు అధికంగానే ఉందని ఆయన తెలిపారు. Also read: Rakul Preet Singh: ఆ వార్తలను నిలువరించాలంటూ.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్


అంతేకాకుండా సంజయ్ రౌత్ పలు వ్యంగాస్త్రాలను కూడా సంధించారు. మహారాష్ట్రలో క‌రోనాను జ‌యించిన వాళ్లంతా భాభిజీ పాప‌డ్ తిని కరోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డారా అంటూ చమత్కరించారు. గ‌తంలో పాపడ్‌ తింటే క‌రోనా పోతుంద‌ని వ్యాఖ్యానించి ఆ తర్వాత విమ‌ర్శ‌ల‌పాలైన‌ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ రౌత్ ఈ విధంగా పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు చేసిన అనంతరం మేఘ్వాల్ కూడా క‌రోనా బారిన పడిన సంగతి తెలిసిందే. Also read: Prahlad Singh Patel: మరో కేంద్ర మంత్రికి కరోనా