Ladakh Accident: లడఖ్‌లో జరిగిన వాహనం ప్రమాదంలో 7 మంది భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. లడఖ్‌లోని తుర్టుక్ సెక్టార్‌లో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు సైనికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఆర్మీ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సైనికులను పశ్చిమ కమాండ్‌కు తరలించేందుకు భారత వైమానిక దళం నుంచి ఆర్మీ సహాయాన్ని కోరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నదిలో పడిన జవాన్ల బస్సు..


పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుంచి 26 మంది సైనికుల బృందం సబ్ సెక్టార్ హనీఫ్‌ కు వెళ్తున్నట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. ఉదయం 9 గంటలకు థోయిస్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో వాహనం రోడ్డుపై నుండి జారి 50-60 అడుగుల దిగువన ఉన్న ష్యోక్ నదిలో పడిపోయింది. 


ఈ బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు జవాన్లు మృతి చెందినట్లు నిర్ధారించారు. బస్సులో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 


Also Read: Aryan Khan Case: క్రూజ్ నౌక డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు..ఆర్యన్‌కు అందుకే ఊరట లభించిందా..?


Also Read: Amreen Bhat: టీవీ నటిని చంపేసిన ఉగ్రవాదులు హతం.. కశ్మీర్ పోలీసుల క్విక్ రియాక్షన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook