Lal Bahadur Shastri Birth Anniversary 2022: అక్టోబర్ 2 జాతి పిత గాంధీ జయంతి మాత్రమే కాదు.. మన దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజు కూడా. భారత దేశానికి స్వేచ్చను ప్రసాదించడంలో ఎన్నో వందల మంది స్వాతంత్య్ర సమరయోధులు అహర్నిషలు కృషి చేయగా.. వారిలో ముందు వరుసలో ఉంటారు లాల్ బహదూర్ శాస్త్రి. స్వేచ్ఛా భారతావనికి ముందు స్వాతంత్య్రం కోసం పోరాడిన ఆయన.. స్వతంత్ర భారతావనిలో నిరుపేదల అభ్యున్నతికి కృషి చేశారు. 1904 అక్టోబర్ 2న వారాణాసికి సమీపంలోని మొఘల్‌సరాయిలో శారద ప్రసాద్ శ్రీవాస్తవ, రామ్ దులారి దేవి దంపతులకు లాల్ బహదూర్ శాస్త్రి జన్మించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజకీయాల్లో జనం మెచ్చిన ఆణిముత్యం లాల్ బహదూర్ శాస్త్రి
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశాన్ని ఏలిన అతి కొద్ది మంది స్వాతంత్య్ర సమరయోధులలో లాల్ బహదూర్ శాస్త్రి ఒకరు. విలువలే ప్రధానంగా కొనసాగిన ఆనాటి రాజకీయాల్లో దేశం గర్వించదగిన ఆణిముత్యం ఆయన. 1964-1966 మధ్య కాలంలో దేశానికి రెండో ప్రధానిగా సేవలు అందించిన లాల్ బహదూర్ శాస్త్రి.. స్వరాజ్యంలో పేదరికం నిర్మూలన కోసం పాటుపడిన మహా మనిషి. అంతకంటే ముందుగా 1961-63 మధ్య కాలంలో ఆయన దేశ 6వ హోం మంత్రిగా పనిచేశారు. పాల ఉత్పత్తి పెంచేందుకు దోహదపడిన శ్వేత విప్లవం, వ్యవసాయం అభివృద్ధికి బాటలు వేసిన హరిత విప్లవం లాంటి ఉద్యమాలను ప్రోత్సహించిన తొలితరం రాజకీయ నాయకులలో అతి ముఖ్యులు లాల్ బహదూర్ శాస్త్రి. 1965లో ఎం.ఎస్. స్వామినాథన్ హరిత విప్లవానికి నాంది పలకగా.. ప్రభుత్వ పెద్దగా ఆ ఉద్యమానికి తన వంతు బాధ్యతగా పూర్తి సహాయసహకారాలు అందించి ఆ మిషన్ విజయవంతం అవడంలో కీలక పాత్ర పోషించారు.


ఇండో-పాక్ వార్‌కి నేతృత్వం  
స్వాతంత్య్రానికి ముందు బ్రిటిషర్లతో పోరాడిన లాల్ బహదూర్ శాస్త్రి.. అదే పోరాట స్పూర్తితో 1965లో ఇండో-పాక్ వార్ సమయంలో మన దేశ ప్రధానిగా నేతృత్వం వహించి భారత సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచారు. జీవితంలో ఎన్నో విజయాలు చూసిన శాస్త్రికి దేశ స్వాతంత్య్రం తొలి విజయమైతే.. ఆ తర్వాత మళ్లీ అంతటి ఆనందాన్నిచ్చిన విజయం ఇండో-పాక్ వార్‌లో పాక్‌పై పైచేయి సాధించడం. సహజంగా గాంధీ బాటలో నడిచిన అహింసావాది ఆయన.. కానీ ఇండో-పాక్ వార్‌లో మాత్రం అగ్రెసివ్‌గా వ్యవహరించారని చెబుతుంటారు. అంతేకాదు.. దేశ రాజకీయాలకు వన్నెతెచ్చిన అతి కొద్ది మంది ప్రముఖులలో ఆయన అగ్ర స్థానంలో ఉంటారు. దేశ ప్రధానిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా అత్యున్నత పదవులు అలంకరించినప్పటికీ.. ఆ సమయంలోనూ అతి సౌమ్యుడిగా వ్యవహరించిన మహా నేతగా లాల్ బహదూర్ శాస్త్రికి మంచి పేరుంది. అందుకే ఆయన్ను సింప్లిసిటీకి, చిరు దరహాసానికి చిరునామాగా చెబుతుంటారు. 


జై జైవాన్.. జై కిసాన్.. 
మనం ఈనాడు గొప్పగా చెప్పుకుంటున్న జై జవాన్.. జై కిసాన్ అనే నినాదం పుట్టింది ఆయన దగ్గర్నుంచే. ఇండో-పాక్ వార్ సమయంలోనే లాల్ బహదూర్ శాస్త్రి తొలిసారిగా జై జవాన్.. జై కిసాన్ నినాదం ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగులేని శక్తిగా నిలిచింది ఆ నినాదం. 


లాల్ బహదూర్ శాస్త్రిని ఇన్‌స్పైర్ చేసింది ఎవరో తెలుసా ? 
మెట్రిక్యులేషన్ చదువుతున్న రోజుల్లోనే గాంధీ, పండిట్ మదన్ మోహన్ మాల్వియ నేతృత్వంలో జరిగిన ఓ స్వాతంత్య్ర సమరభేరి సభకు హాజరైన లాల్ బహదూర్ శాస్త్రి.. అక్కడ మహాత్మా గాంధీ, మదన్ మోహన్ మాల్వియా ప్రసంగాలకు ఆకర్షితులై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో స్టూడెంట్ వాలంటీర్‌గా చేరి స్వాతంత్ర్యం కోసం తన వంతు పోరాటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేసిన ది గ్రేట్ ఫ్రీడం ఫైటర్, ఏ గ్రేట్ రూలర్ మన లాల్ బహదూర్ శాస్త్రి. యాదృశ్చికంగా గాంధీ పుట్టిన రోజు.. లాల్ బహదూర్ శాస్త్రి బర్త్‌డే కూడా ఒకటే అవడం మరో విశేషం. నేడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా యావత్ దేశం తరపున జీ తెలుగు న్యూస్ ఆయనకు సెల్యూట్ చేస్తూ నివాళి అర్పిస్తోంది.


Also Read : Gandhi Jayanti 2022: గాంధీ జయంతి చరిత్ర, ప్రాముఖ్యత, ప్రపంచ అహింసా దినోత్సవం నేపథ్యం


Also Read : YSR Jayanthi 2022: వైఎస్ఆర్ జయంతి.. వైఎస్ఆర్‌కి ఎందుకంత ఫ్యాన్ ఫాలోయింగ్ ? వైయస్ఆర్ డెత్ మిస్టరీ ఏంటి ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి