లాలూ ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత.. రిమ్స్‌లో చికిత్స !
లాలూ ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత.. రిమ్స్‌లో చికిత్స !
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని రాంచిలోని రిమ్స్ ( రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కుడికాలికి ఇన్‌ఫెక్షన్ అయిన కారణంగా అది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని లూలూకు చికిత్స అందిస్తున్న రిమ్స్ వైద్యులు తెలిపారు. గడ్డి కుంభకోణం కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మధుమేహం వ్యాధితోనూ బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు.. కాలికి అయిన ఇన్‌ఫెక్షన్ కొంత బాధిస్తోంటే, మరోవైపు గత రెండు, మూడు రోజులుగా శరీరంలో షుగర్, బీపీ లెవెల్స్ పెరిగిపోతున్నాయని ఆయనకు చికిత్స అందిస్తున్న రిమ్స్ వైద్యులు డా. ఉమేష్ ప్రసాద్ పీటీఐకి తెలిపారు. ఒక్కసారిగా పెరిగిన షుగర్ లెవెల్స్‌ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇన్సులిన్ డోస్ పెంచి ఇస్తున్నట్టు డా. ఉమేష్ ప్రసాద్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.