భాష,సంస్కృతి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అమెరికాలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాల్ని ఆన్ లైన్ లో ఆయన ప్రారంభించారు. తెలుగువారంతా ఒక్కటే అనే భావనను ప్రతిబింబించాలని విజ్ఞప్తి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా సంక్షోభ కాలంలో సైతం తెలుగువారు ఒక్కటిగా చూపించే ప్రయత్నం చేశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా ) ఆధ్వర్యంలో జరుగుతున్న మహోత్సవాల్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. భాష అనేది మానవ సంబంధాల అభివృద్ధి క్రమంలో ఏర్పడిన భావ వ్యక్తీకరణ అని వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కరోనా నేపధ్యంలో సామాజిక దూరం, ఆరోగ్య సూచనల్ని పాటించాలని జాగ్రత్తలు చెప్పారు. భాష, సంస్కృతిని విడిగా రెండుగా చూడలేమని చెప్పారు. తల్లిలాంటి మాతృభాషను కాపాడుకోవల్సిన అవసరం అందరిపై ఉందన్నారు వెంకయ్యనాయుడు. Also read: Jobs: బీటెక్ పాసయ్యారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధం


భాష అంటే కేవలం మనం మాట్లాడుకునే నాలుగు మాటలు కాదని...సంస్కృతిని నింపుకున్న వ్యక్తీకరణ అని చెప్పారు. భాష అనేది సంస్కృతిలో అంతర్భాగమని చెప్పారు. ప్రతి నాగరికత గొప్పదనమనేది భాష ద్వారానే తెలుస్తుందన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భాష లేకుండా ఆటలు, మాటలు, పాటలు, సంగీతం, సాహిత్యం, కళలు, పండుగలు, పబ్బాలు , కార్యక్రమాలు, వ్యాపారాలు ఉండవన్నారు. భాష అనేది సమాజాన్ని సృష్టించి జాతిని బలపరుస్తుందన్నారు. Also read: Rajastan Crisis: అశోక్ గెహ్లట్ చెప్పేదంతా అబద్దం : వీడియోలు విడుదల చేసిన సచిన్ పైలట్ వర్గం