Rajastan Crisis: అశోక్ గెహ్లట్ చెప్పేదంతా అబద్దం : వీడియోలు విడుదల చేసిన సచిన్ పైలట్ వర్గం

న్యూ ఢిల్లీ: సచిన్ పైలట్‌కి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ( Sachin Pilot's supporters ) అంతా బీజేపి చేతిలో బంధీలుగా ఉన్నారని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు సచిన్ పైలట్‌కు మద్దుతు పలుకుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.

Last Updated : Jul 24, 2020, 06:09 PM IST
Rajastan Crisis: అశోక్ గెహ్లట్ చెప్పేదంతా అబద్దం : వీడియోలు విడుదల చేసిన సచిన్ పైలట్ వర్గం

న్యూ ఢిల్లీ: సచిన్ పైలట్‌కి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ( Sachin Pilot's supporters ) అంతా బీజేపి చేతిలో బంధీలుగా ఉన్నారని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు సచిన్ పైలట్‌కు మద్దుతు పలుకుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సచిన్ పైలట్‌ని బీజేపి ( BJP ) ముందుంచి నడిపిస్తూ.. ఆయనకు మద్దతు ఇస్తున్న వారిని బీజేపి బంధించిందని అశోక్ గెహ్లట్ (CM Ashok Gehlot ) ఆరోపిస్తున్నారు కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని సచిన్ పైలట్‌కి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మురారి లాల్ మీనా తెలిపారు. ( Also read: Sony ZV-1: సోని నుంచి పాకెట్ సైజ్ డిజిటల్ కెమెరా.. ధర ఎంతో తెలుసా ? )

తామంతా ప్రస్తుతం ఢిల్లీలో స్వేచ్చాపూరితమైన వాతావరణంలోనే ఉన్నామని.. అది కూడా తమ ఇష్టం మేరకే ఇక్కడ ఉంటున్నాం కానీ ఇందులో ఎవ్వరి ఒత్తిడి లేదని సచిన్ పైలట్ వర్గానికే చెందిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేష్ మోదీ అన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌కి ఎంతో చెప్పి చూశామని.. కానీ ఆయన మా మాట వినడం లేదని సురేష్ మోదీ ఆరోపించారు. IPL 2020: ఐపీఎల్ తేదీ ఫిక్స్.. వేదికలివే )

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌కి ఆ పార్టీ అధిష్టానానికి సచిన్ పైలట్ ఎదురుతిరిగినప్పటి నుంచి రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ సంక్షోభానికి కారకుడైన సచిన్ పైలట్ బీజేపితో చేతులు కలిపి కుట్రకు పాల్పడుతున్నట్టు అశోక్ గెహ్లాట్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోంచి కూల్చి బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగానే రాజస్థాన్‌‌లోనూ కాంగ్రెస్ పార్టీ సర్కారును కూల్చేందుకు కుట్ర జరుగుతోందని అశోక్ గెహ్లట్ ఆరోపిస్తున్న నేపథ్యంలోనే సచిన్ పైలట్ మద్దతుదారులు వివరణ ఇచ్చారు. ( Also read: Work from home: ఐటి ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ )

Trending News