Litre Petrol for One Rupee: పెట్రోల్ ధరలు ఎంతలా భగ్గుమంటున్నాయో తెలిసిందే. బండి బయటకు తీయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇదివరకు, సందు చివరలో ఉన్న షాపుకు వెళ్లాలన్నా బండి తీసినవారు... ఇప్పుడు అత్యవసరమైతే తప్ప బండి జోలికి వెళ్లట్లేదు. లీటర్ పెట్రోల్ ధర రూ.120కి చేరడంతో.. తప్పదనుకుంటే తప్ప వాహనదారులు తమ బండ్లను బయటకు తీయట్లేదు. ఇలాంటి తరుణంలో ఓ పెట్రోల్ బ్యాంక్ యాజమాన్యం రూ.1కే లీటర్ పెట్రోల్ అని ప్రకటించడంతో జనం ఎగబడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న (ఏప్రిల్ 14) అంబేడ్కర్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని సోలాపూర్‌లో అంబేడ్కర్ స్టూడెంట్స్ అండ్ యూత్ పాంథర్స్ ఆధ్వర్యంలో ఈ 'రూపాయికే పెట్రోల్' కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత వచ్చిన 500 మందికి కేవలం ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామని ప్రకటించారు. దీంతో ఎక్కడెక్కడి నుంచో వాహనదారులంతా ఆ పెట్రోల్ బంక్ వద్దకు క్యూ కట్టారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. 


అంబేడ్కర్ స్టూడెంట్స్ అండ్ యూత్ పాంథర్స్ సభ్యుడు మహేష్ సర్వగోడ దీనిపై మాట్లాడుతూ... 'నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. లీటర్ పెట్రోల్ ధర రూ.120కి చేరింది. ఇవాళ అంబేడ్కర్ జయంతి కావడంతో లీటర్ పెట్రోల్‌ను కేవలం రూపాయికే అందించాలని నిర్ణయించాం. తద్వారా వాహనదారులకు కాస్త రిలీఫ్ దొరికినట్లవుతుంది.' అని వెల్లడించారు. మాలాంటి చిన్న సంస్థ 500 మందికి రూపాయికే పెట్రోల్ ఆఫర్ చేస్తున్నప్పుడు... ప్రభుత్వంలో ఉన్నవారు ఇంకా ఎంతోమందికి రిలీఫ్ అందించగలరు... ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి అని మహేష్ పేర్కొన్నారు. 


అంబేడ్కర్ స్టూడెంట్స్ అండ్ యూత్ అందించిన ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్న కస్టమర్స్ సంతోషం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు గుదిబండలా మారినవేళ... ఇలా రూపాయికే పెట్రోల్ అందించడం చాలామందికి బిగ్ రిలీఫ్ కలిగించిందని అన్నారు. 


Also Read: Krishna Viral Photo: సూపర్‌స్టార్ కృష్ణ ఫోటో వైరల్... ఆయనకేమైందని ఫ్యాన్స్ ఆందోళన...


Also Read: Horoscope Today April 15 2022: రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook