Assembly Elections 2023 Live Updates: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ఇదే.. ఫలితాలు ఎప్పుడంటే..?

Mon, 09 Oct 2023-12:53 pm,

Assembly Elections 2023 Schedule Live Updates: మినీ కురుక్షేత్రానికి సర్వం సిద్ధమైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ మరికాసేపట్లో విడుదల చేయనుంది. ఎన్నికల లైవ్‌ అప్‌డేట్స్‌ ఇక్కడ క్లిక్ చేయండి..

Assembly Elections 2023 Schedule Live Updates: ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నగరా మోగబోతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ ఏడాది నవంబర్-డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది. వచ్చే ఏడాది దేశంలో లోక్‌సభ ఎన్నికలతోపాటు మిగిలిన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో వచ్చే ఏడాది కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని తేలే అవకాశం ఉంది. నోటిఫికేషన్ కంటే ముందే కాంగ్రెస్, బీజేపీ మినహా అన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలంగాణ విషయానికి వస్తే.. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ కూడా జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నాయి. 

Latest Updates

  • 17,734 మోడల్ పోలింగ్ స్టేషన్లు, 621 పోలింగ్ స్టేషన్ల నిర్వహణ బాధ్యత పీడబ్ల్యూడీ సిబ్బందిదేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 8,192 పోలింగ్‌ కేంద్రాల్లో మహిళలు బాధ్యతలు చేపట్టనున్నారు. 

  • ==> తెలంగాణ: 30వ తేదీ నవంబర్ 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> రాజస్థాన్: 23వ తేదీ నవంబర్ 

    ==> మధ్యప్రదేశ్: 17వ తేదీ నవంబర్

    ==> మిజోరం: 7వ తేదీ నవంబర్

    ==> ఛత్తీస్‌గఢ్: 2 దశల్లో పోలింగ్, నవంబర్ 7, 17వ తేదీల్లో ఓటింగ్ జరగనుంది.

  • ==> నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లు 

    ==> నవంబర్ 13న స్క్రూట్నీ

    ==> నవంబర్ 15వ తేదీ వరకు విత్ డ్రాకు అవకాశం

  • ==> తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు

    ==> డిసెంబర్ 3న ఫలితాలు

  • ==> ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

    ==> తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు

  • ==> తెలంగాణలో 35,356 పోలింగ్ కేంద్రాలు: సీఈసీ

    ==> తెలంగాణలో ప్రతీ 879 మందికి ఒక పోలింగ్ స్టేషన్

  • ==> ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> 5 రాష్ట్రాల్లో లక్షా 77 వేల పోలింగ్ కేంద్రాలు

    ==> ఐదు రాష్ట్రాల్లో 60 లక్షల మంది కొత్త ఓటర్లు

  • ==> వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం. 

    ==> ఛత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్లు, రాజస్థాన్‌లో 5.25 కోట్లు, తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

  • ==> ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> మొత్తం దేశంలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పోల్చితే 1/6వ వంతు

    ==> ఓటర్ల సంఖ్య ప్రకారం చూసినా సరే 1/6 వ వంతు జనాభా ఈ రాష్ట్రాల్లో ఉన్నారు

    ==> ఈ రాష్ట్రాల్లో 60.20 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు

  • ==> ఐదు రాష్ట్రాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

    ==> తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్, మిజోరాంలో ఎన్నికలు

    ==> పార్టీలు, ప్రభుత్వ అధికారులతో చర్చలు నిర్వహించాం-సీఈసీ

  • ఐదు రాష్ట్రాల ఎన్నికల కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటిస్తున్నారు. 
     

  • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. కాసేపట్లో ఢిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో ఎన్నికల సంఘం మీడియా సమావేశం ప్రారంభంకానుంది.
     

  • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండడంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నేడు న్యూఢిల్లీలో సమావేశం కానుంది.

     

  • ఇటీవల వార్తల్లో వచ్చిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ నేపథ్యంలో జమిలి ఎన్నికల ప్రస్తావన విన్పించింది. అదే క్రమంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావచ్చనే వార్తలు కూడా విన్పించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • మిజోరం అసెంబ్లీ పదవీకాలం డిసెంబర్‌తో ముగియనుంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ గడువు జనవరితో ముగియనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించింది. 

  • తెలంగాణలో 119, మిజోరాం 40, ఛత్తీస్‌గఢ్ 90, మధ్యప్రదేశ్ 230, రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 
     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link