Five State Election Schedule: మద్యాహ్నం 12 గంటలకు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్

Five State Election Schedule: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ మొత్తానికి విడుదల కానుంది. తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిల షెడ్యూల్ మరి కాస్సేపట్లో రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 9, 2023, 09:52 AM IST
Five State Election Schedule: మద్యాహ్నం 12 గంటలకు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్

Five State Election Schedule: కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. మద్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. ఎన్నికలెప్పుడు, నోటిఫికేషన్ వివరాలు అన్నీ మద్యాహ్నం వివరించనుంది ఎన్నికల సంఘం.

ఇటీవల వార్తల్లో వచ్చిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ నేపధ్యంలో జమిలి ఎన్నికల ప్రస్తావన విన్పించింది. అదే క్రమంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావచ్చనే వార్తలు కూడా విన్పించాయి. ఇప్పుడీ పుకార్లకు చెక్ పడింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయనుంది. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరగనున్నాయి, నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది, కౌంటింగ్ ఎప్పుడనే వివరాలు అందించనుంది. 

తెలంగాణ ఆసెంబ్లీలో 119 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ పదవీకాలం జనవరి 16తో ముగుస్తోంది. ఇక జనవరి 6తో ముగియనున్న మద్యప్రదేశ్ అసెంబ్లీలో 230 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ జనవరి 14తో ముగియనుండగా మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అటు ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలకు, మిజోరాంలో 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

మద్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నియమావళి అమల్లో రానుంది. తెలంగాణ, మధ్యప్రదేస్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు వేర్వేరు తేదీల్లో ఒకే విడతలోనూ, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. 

Also read: Sikkim Flash Floods: సిక్కిం వరదల్లో పెరుగుతున్న మరణాలు, సహాయం కోసం 3 వేలమంది నిరీక్షణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News