Independence Day 2022 Live Updates: హర్ ఘర్ తిరంగా.. ఎర్రకోటపై ఎగిరిన జాతీయ జెండా
Independence Day 2022 Live Updates: భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఊరూవాడా జాతీయ జెండాలను ఆవిష్కరించారు
Independence Day 2022 Live Updates: భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఊరూవాడా జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేశారు. వజ్రోత్సవాల సందర్భంగా కేంద్ర సర్కార్ ఇచ్చిన హర్ ఘర్ తిరంగా ప్రచారానికి ఊహించని స్పందన వచ్చింది. దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి లైవ్ అప్ డేట్స్ ...
Latest Updates
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం వైఎస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ ప్రదర్శనను తిలకించారు.ప్రభుత్వ పథకాలతో రూపొందించిన వివిధ శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలుపర్చకపోవడం ద్వారా ప్రజలకు కొన్ని పార్టీలు అన్యాయం చేశాయన్నారు. స్వతంత్రంగా ఉండాల్సిన మీడియా కొందరికి భజన చేస్తుందని స్వాతంత్ర్య సమరయోధులు ఎన్నడైనా ఊహించారా? అని జగన్ ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల విభజన చేపట్టామన్నారు. గత మూడేళ్లలో 95 శాతం హామీలను అమలు చేశామన్నారు జగన్.
గోల్కొండ కోటపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రసంగించారు. ఈ రోజు ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయని చెప్పారు. తెలంగాణలో 1.25 కోట్ల జెండాలను ప్రతి ఇంటికీ అందించామని.. తెలంగాణ రాష్ట్రం మొత్తం త్రివర్ణ జెండాలతో రెపరెపలాడుతుందని కేసీఆర్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
విజయవాడలో జాతీయ జెండా ఎగురవేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
ఐక్యమతమే మన ఆయుధం కావాలి
మన వారసత్వాన్ని భావి తరాలకు అందించాలి
సమాజంలో వివక్షను తొలగిస్తామనే నమ్మకం ఉంది
సంపూర్ణ అభివృద్ధి మన లక్ష్యం కావాలి
వచ్చే 25 ఏళ్లు దేశానికి అత్యంత కీలకం
ప్రణాళికలతో అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుదాం
ప్రస్తుతం ఆహారధాన్యాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం
బానిసత్వ విముక్తి కోసం పోరాడుదాం
ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం
ప్రపంచం భారత్ వైపు చూసేలా మనం ఎదిగాం
ఈ మార్పు కోసం ప్రతి ఒక్కరు శ్రమించారు
మదర్ ఆఫ్ డెమోక్రసిగా భారత్ కు గుర్తింపు వచ్చింది
ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిది
ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం
ఎందరో త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్ర్యం
దేశం కోసం పోరాడానికి వీరులకు సెల్యూట్
ఒకప్పుడు భారత్ లో ఆకలి కేకలు వినిపించేవి
75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం
దేశ అభివృద్ధికి సహకరించిన వారందరిని స్మరించుకుందాం