Noida Supertech Twin Towers demolition LIVE Updates: చరిత్రలో కలిసిపోయిన నోయిడా ట్విన్ టవర్స్.. 9 సెకన్లలో 40 అంతస్తులు నేలమట్టం
Noida Supertech twin towers demolition: నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ నేలమట్టమైంది. తొమ్మిది సెకండ్లలోనే రెండు భవనాలు కుప్పకూలిపోయాయి.
Noida Supertech twin towers demolition LIVE Updates: నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ నేలమట్టమైంది. తొమ్మిది సెకండ్లలోనే రెండు భవనాలు కుప్పకూలిపోయాయి. ఆదివారం సరిగ్గా మధ్యాహ్నం 2:30 గంటలకు సూపర్‌టెక్ ట్విన్ టవర్స్‌ను కూల్చివేశారు. పోలీసుల నుంచి క్లియరెన్స్ రాగానే.. మీట నొక్కి పేలుళ్లు జరిపారు. 100 మీటర్ల పొడవన్న ట్విన్ టవర్స్ కేవలం 10 సెకన్లలోనే నేలమట్టమయ్యాయి. మన దేశానికి చెందిన బ్లాస్టర్ చేతన్ దత్తా బటన్ నొక్కగానే అపెక్స్, సియానేలను కూల్చేశారు. ట్విన్ టవర్స్ నేలమట్టం అయ్యాకా పెద్ద ఎత్తున దుమ్ము ఎగిసిపడింది. 40 మీటర్ల వరకు దట్టమైన పొగ మంచు అలుముకుంది. భవనాలు కూల్చిన ప్రాంతం నుంచి చాలా దూరం వరకు ఆ దుమ్ము కనిపించింది.
Latest Updates
ట్విన్ టవర్స్ నేలమట్టం అయ్యాకా పెద్ద ఎత్తున దుమ్ము ఎగిసిపడింది. 40 మీటర్ల వరకు దట్టమైన పొగ మంచు అలుముకుంది. భవనాలు కూల్చిన ప్రాంతం నుంచి చాలా దూరం వరకు ఆ దుమ్ము కనిపించింది.
ట్విన్ టవర్స్ నేలమట్టం కావడంతో 40 మీటర్ల మేర దట్టంగా అలుముకున్న పొగ మంచు
సక్సెస్ ఫుల్ గా నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత
టవర్స్ ను నేలమట్టం చేసిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ
3700 కిలోల పేలుడు పదార్థాలతో భవనాలు నేలమట్టం
40 మీటర్ల మేర దట్టంగా అలుముకున్న పొగ మంచు
9 సెకండ్లలో కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్
9 సెకండ్లలో కుప్పకూలిన నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్స్
ఇండియన్ బ్లాస్టర్ చేతన్ దుత్తా బటన్ నొక్కగానే పేకమేడలా కూలిన 40 అంతస్తుల భవనాలు
ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియలో పాల్గొన్న 100 మంది సిబ్బంది
టవర్స్ నేలమట్టం కావడంతో 5 వేల 5 వందల టన్నుల వ్యర్దాలు
4 వేల టన్నుల స్టీల్.. తరలించేందుకు 3 నెలలు పట్టే అవకాశం
నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు కౌంట్ డౌన్ ..
సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వం సిద్ధం
నోయిడా ఎక్స్ ప్రెస్ రహదారి మూసివేత
మధ్యాహ్నం 3 గంటల వరకు రహదారి క్లోజ్
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత ఖర్చు రూ. 20 కోట్లు
సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ లో మొత్తం 913 ఫ్లాట్స్
ట్విన్ టవర్స్ ప్రాజెక్ట్ మొత్తం అంచనా రూ. 1200 కోట్లు
915 ఫ్లాట్స్ కు గాను 633 ఫ్లాట్లకు బుకింగ్
180 కోట్ల రూపాయలు చెల్లించిన కస్టమర్లు
కొనుగోలు దారులకు 12 శాతం వడ్డీతో మనీ రీఫండ్
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు మొదలైన కౌంట్ డౌన్
అన్ని చర్యలు తీసుకున్నామన్న గ్రేటర్ నోయిడా సీపీ
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రాంతానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు ముందు మొత్తం 11 స్మోగ్ గన్‌లను మోహరించారు. పార్సవంత్ సర్వీస్ రోడ్డుకు ఎదురుగా రెండు మోహరించారు, సిటీ పార్క్ నుండి ATS వరకు 3, గెజా కమ్యూనిటీ సెంటర్‌కు ఎదురుగా ఒకటి,
జేపీ ఫ్లైఓవర్ దగ్గర, ఎల్డెకో పక్కన, ఎమరాల్డ్ కోర్ట్ ముందు స్మోక్ గన్లను పెట్టారు.నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కు సమీపంలో ఉన్న 40 టవర్స్ లో నివాసమంటున్న జనాలను అధికారులు ఖాళీ చేయించారు. మధ్యాహ్నం రెండున్నరకు ట్విన్ టవర్స్ ను కూల్చివేయనున్నారు.
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత సందర్భంగా 560 మంది పోలీసు సిబ్బంది, 100 మంది రిజర్వ్ బలగాలు, 4 క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను మోహరించారు. NDRF బృందాన్ని అందుబాటులో ఉంచారు. ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు యాక్టివేట్ అయ్యాయని సెంట్రల్ డీసీపీ రాజేష్ చెప్పారు.
ట్విన్ టవర్స్ పిల్లర్స్‌కి 7000 రంధ్రాలు చేసి అందులో 3700 కిలోల పేలుడు పదార్థాలు అమర్చారు. కూల్చివేత సమయంలో కేవలం 10 మంది అధికారులు మాత్రమే అక్కడ ఉండి పర్యవేక్షించనున్నారు. కూల్చివేత సమయంలో నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై రాకపోకలను నిలిపివేస్తారు. కూల్చివేతకు 9 సెకన్లు, గాల్లోకి వెలువడే దుమ్ము,ధూళి పోవడానికి మరో 12 సెకన్ల సమయం పట్టనుంది. కూల్చివేత సమయంలో రిక్టర్ స్కేలుపై 0.4 మ్యాగ్నిట్యూడ్‌కి సమానమైన ప్రకంపనలు వెలువడుతాయని అధికారులు చెబుతున్నారు.