Parliament Live Updates: పార్లమెంట్‌లోకి దూరిన ఆ ఇద్దరు దుండగులు ఎవరు..? లోపలికి ఎలా వచ్చారు..?
Parliament Attack Live Updates: పార్లమెంట్‌లోకి ఇద్దరు ఆగంతకులు దూరి గందరగోళం సృష్టించారు. టియర్ గ్యాస్ వదలడంతో ఎంపీలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి..
Parliament Attack Live Updates: భారత పార్లమెంట్‌లోకి ఇద్దరు ఆగంతకులు దూరడం కలకలం సృష్టిస్తోంది. బుధవారం పబ్లిక్ గ్యాలరీ నుంచి ఒక వ్యక్తి.. మరో వ్యక్తి విజిటర్స్ గ్యాలరీ నుంచి టియర్ గ్యాస్ వదిలి గందరగోళం సృష్టించారు. పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన 22 సంవత్సరాలు పూర్తయిన రోజే మళ్లీ లోక్‌సభలో ఇద్దరు దుండగులు దూరడం సంచలనంగా మారింది. పార్లమెంట్‌లోకి దూరిన ఇద్దరు దుండగులను సెక్యూరిటీ సిబ్బంది అదుపులో తీసుకున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో భయభ్రాంతులకు గురైన ఎంపీలు బయటకు పరిగెత్తారు. లోక్‌సభలో జీరో అవర్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Latest Updates
Tear Gas Attack Parliament Live Updates: "చాలా మంది ఎంపీలు ఇప్పటికీ షాక్‌లో ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు సిగరెట్ లైటర్, టియర్ గ్యాస్ డబ్బాతో పార్లమెంటులోకి ఎలా ప్రవేశించారని చర్చిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసిన తరువాత కూడా చాలా మంది భద్రతా సిబ్బంది, పోలీసు కమాండోలకు పూర్తిగా తెలియదు" అని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ట్వీట్ చేశారు.
Tear Gas Attack Parliament Live Updates: పార్లమెంట్ సిబ్బంది భద్రతా ఉల్లంఘనల నేపథ్యంలో ఫోరెన్సిక్ బృందం పార్లమెంట్ ప్రాంగణంలో నమూనాలను సేకరించేందుకు వచ్చింది.
Tear Gas Attack Parliament Live Updates: నిందితులందరూ తమ బూట్లలో టియర్ గ్యాస్ డబ్బాలను తీసుకెళ్లారని తెలిసింది. 2001 పార్లమెంట్ దాడి జరిగిన రోజే ఈ ఘటన చోటు చేసుకుంది.
Tear Gas Attack Parliament Live Updates: తాము ఏ సంస్థతోనూ సంబంధం కలిగి లేమని.. ప్రభుత్వ అఘాయిత్యాలకు పాల్పడుతున్నందున ఈ చర్య తీసుకున్నామని నిందితుడు నీలం తెలిపాడు.
Tear Gas Attack Parliament Live Updates: పార్లమెంట్ వెలుపలి నుంచి అరెస్టు చేసిన ఇద్దరు నిరసనకారులను హిసార్‌కు చెందిన నీలం (42), మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన అమోల్ షిండే (25)గా ఢిల్లీ పోలీసులు గుర్తించారు.
Tear Gas Attack Parliament Live Updates: పార్లమెంటు భద్రతలోకి చొచ్చుకు వచ్చిన వ్యక్తుల వద్ద ఉన్న అన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓఎం బిర్లా తెలిపారు. పార్లమెంటు వెలుపల ఉన్న ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.