Assembly elections 2018 results and counting live updates : తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Tue, 11 Dec 2018-7:49 pm,

డిసెంబర్ 7న తెలంగాణతోపాటు రాజస్తాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సహా అంతకన్నా ముందుగా చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లోనూ జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మొత్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికి నేటి ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయఢంకా మోగించారు, ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే ఫలితం ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. 

Latest Updates

  • > టీఆర్ఎస్ కు ఊహించని షాక్: ఓటమిపాలైన ఇద్దరు మంత్రులు

  • > లగడపాటి లెక్క తప్పింది ;  ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమయ్యాయి..

  • * టీఆర్ఎస్ పార్టీకి భారీ ఆధిక్యం కట్టబెట్టిన తెలంగాణ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి మీడియా సమావేశంలో పాల్గొన్న కేసీఆర్.

  • * ప్రస్తుతం తెలంగాణలో వున్న ఓట్ల కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం టీఆర్ఎస్ పార్టీ 86 స్థానాలతో భారీ మెజార్టీతో ముందంజలో వుండగా కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరుస్తోంది. ఇక బీజేపీ 3, ఇతరులు 8 స్థానాల్లో కొనసాగుతున్నారు

  • * తెలంగాణ సినిమాటోగ్రఫి శాఖకు ఆపద్ధర్మ మంత్రిగా వున్న టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గం నుంచి 30,217 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

  • గజ్వెల్ నుంచి గెలిచిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్

  • * మిజోరాం ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తున్న మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ సంబరాల్లో మునిగితేలుతోంది. ఐజ్వాల్‌లోని ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మొత్తం 40 స్థానాలు వున్న మిజారంలో ఇప్పటికే ఆ పార్టీ 14 స్థానాలు గెలుచుకోగా మరో 9 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. 

  • * మిజోరాంలో 12 స్థానాల్లో గెలిచి ముందంజలో దూసుకుపోతున్న మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) పార్టీ. 7 స్థానాల్లో విజయం సాధించిన స్వతంత్ర్య అభ్యర్థులు.
     

  • ఓడిపోయే వాళ్లంతా పాడే పాటే అది: టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత

  • * చత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ పార్టీ 59 స్థానాలతో భారీ ఆధిక్యం కనబరుస్తుండగా 21 స్థానాలతో బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. జేసీసీ+ 8, ఇతరులు 2 స్థానాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఆధిక్యంలో వున్నారు.

  • * రాజస్తాన్‌లో అధికార పార్టీ బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో ముందంజలో వుండగా బీజేపీ 80 స్థానాలతో రెండో స్థానంలో వుంది. బీఎస్పీ 3 స్థానాలు, ఇతరులు 21 స్థానాల్లో ఆధిక్యంలో వున్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుండటంపై ఆ పార్టీ నేత సచిన్ పైలట్ హర్షం వ్యక్తంచేశారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంగా తాజాగా మీడియాతో మాట్లాడిన సచిన్ పైలట్.. రాజస్తాన్‌లో పార్టీ విజయం కాంగ్రెస్ పార్టీలో అందరి కృషి కారణంగానే సాధ్యపడిందని అన్నారు. సరిగ్గా ఏడాది క్రితం పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీకి ఇది కాంగ్రెస్ అందించిన బహుమానం అని సచిన్ పైలట్ అభిప్రాయపడ్డారు. 

    * మధ్యప్రదేశ్‌లో ఆధిక్యంలో దూసుకుపోతున్నాం అనుకున్న కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ బీజేపీ మళ్లీ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం బీజేపీ 116 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో ముందంజలో వుంది. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతపై ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఇంచార్జ్ కమల్ నాథ్‌కి ఫోన్ చేసి ఆరాతీశారు.

  • రాహుల్ గాంధీకి ఇదే కాంగ్రెస్ ఇచ్చిన బహుమానం
    రాజస్తాన్‌లో అధికార పార్టీ బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో ముందంజలో వుండగా బీజేపీ 80 స్థానాలతో రెండో స్థానంలో వుంది. బీఎస్పీ 3 స్థానాలు, ఇతరులు 21 స్థానాల్లో ఆధిక్యంలో వున్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుండటంపై ఆ పార్టీ నేత సచిన్ పైలట్ హర్షం వ్యక్తంచేశారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంగా తాజాగా మీడియాతో మాట్లాడిన సచిన్ పైలట్.. రాజస్తాన్‌లో పార్టీ విజయం కాంగ్రెస్ పార్టీలో అందరి కృషి కారణంగానే సాధ్యపడిందని అన్నారు. సరిగ్గా ఏడాది క్రితం పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీకి ఇది కాంగ్రెస్ అందించిన బహుమానం అని సచిన్ పైలట్ అభిప్రాయపడ్డారు.

  • > అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ముఖ్యమంత్రి

  • * తెలంగాణలో టీఆర్ఎస్ 90, కాంగ్రెస్ పార్టీ 16, ఏఐఎంఐఎం పార్టీ 5, బీజేపీ 1 స్థానాల్లో ఆధిక్యంలో వున్నారు. ఇవే కాకుండా మరో మూడు నియోజకవర్గాల్లో స్వతంత్ర్య అభ్యర్థులు ముందంజలో వున్నారు.

  • * మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 112, బీజేపీ 102 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా ఇతరులు 14 స్థానాల్లో ముందంజలో వున్నారు. ఇప్పటివరకు పూర్తయిన లెక్కింపు ప్రకారం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకన్నా 10 స్థానాల్లో ముందంజలో వుంది.

  • * తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ 95, కాంగ్రెస్ పార్టీ 17, బీజేపీ 3, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో వున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో ఆ పార్టీనేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

  • తెలంగాణ భవన్ ఎదుట టీఆర్ఎస్ సంబరాలు

  • * మిజోరాం ఎన్నికల ఫలితాల్లో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 22 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తుండగా కాంగ్రెస్ 10 స్థానాల్లో మాత్రమే ముందంజలో వుంది. ఇతరులు మరో 6 స్థానాల్లో ఆధిక్యంలో వున్నారు. బీజేపీ 2 స్థానాల్లో ఖాతా తెరిచినట్టు తాజా ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి.

  • * చత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ పార్టీ 54 స్థానాలు, బీజేపీ - 26, జేసీసీ 5, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో వున్నారు.

  • * రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో దూసుకుపోతోంది. 10 గంటల వరకు పూర్తయిన లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ 100 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా ఇప్పటివరకు అధికారంలో వున్న బీజేపీ 80 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.

  • * మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉండగా ప్రస్తుతానికి 208 స్థానాల ఓట్ల లెక్కింపు వివరాలు అందుబాటులో వున్నాయి. అందులో 105 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో వుండగా 103 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది.

  • * తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుతం అందుబాటులో వున్న ట్రెండ్స్ ప్రకారం టీఆర్ఎస్ 78 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో ముందంజలో వుంది. ఇక బీజేపీ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో వుండగా ఇతరులు మరో ఆరు స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link