రెండో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్‌డేట్స్
లోక్ సభ రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అస్సాం, బిహార్, ఛత్తీస్‌ఘడ్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిషా, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ నేడు రెండో విడత పోలింగ్ జరగనుంది.
న్యూఢిల్లీ: లోక్ సభ రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అస్సాం, బిహార్, ఛత్తీస్‌ఘడ్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిషా, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ నేడు రెండో విడత పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారమే ఉదయం 7 గంటల నుంచి మొదలుపెడితే, పలు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది.
Latest Updates
పోలింగ్ జరుగుతుండగానే అభ్యర్థి వాహనంపై కాల్పులు:
కోల్‌కతా: లోక్ సభ రెండో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని రాయగంజ్ స్థానం నుంచి సీపీఐ(ఎం) పార్టీ తరపున బరిలో నిలిచిన మొహమ్మద్ సలీం ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఎన్నికల విధుల్లోనే గుండెపోటుతో మృతి:
రాయ్‌పూర్: ఛత్తీస్‌ఘడ్‌లో రెండో విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కంకర్ జిల్లాలో నేడు జరుగుతున్న పోలింగ్‌లో ఓ విషాదం చోటు చేసుకుంది. 186 నెంబర్ గల పోలింగ్ బూత్ వద్ద విధులు నిర్వహిస్తోన్న అధికారి ఒకరు హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న రజినీకాంత్, అజిత్, విజయ్, కమల్ హాసన్, ఇతర రాజకీయ ప్రముఖులు
ఇదిలావుండగా తూర్పు త్రిపుర లోక్ సభ నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్న విశ్వసనీయమైన సమాచారం మేరకు అక్కడ నేడు జరగాల్సి వున్న పోలింగ్‌ని వాయిదా వేసిన ఎన్నికల సంఘం.. తిరిగి ఏప్రిల్ 23న అక్కడ పోలింగ్ చేపట్టనున్నట్టు ప్రకటించినట్టు తెలుస్తోంది.