ఓటు హక్కు వినియోగించుకున్న రజినీకాంత్, అజిత్, విజయ్, కమల్ హాసన్

ఓటు హక్కు వినియోగించుకున్న రజినీకాంత్, అజిత్, విజయ్, కమల్ హాసన్

Updated: Apr 18, 2019, 11:42 AM IST
ఓటు హక్కు వినియోగించుకున్న రజినీకాంత్, అజిత్, విజయ్, కమల్ హాసన్
Source : ANI

చెన్నై: రెండో విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ హీరోలు తళ అజిత్, విజయ్ ఇళయ దళపతి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ బెంగుళూరులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తోన్న సంగతి తెలిసిందే.

 

 

అలాగే లోక నాయకుడు, మక్కల్ నీధి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ సైతం క్యూ లైన్‌లో నిల్చుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం, ఆయన తనయుడు కార్తి చిదంబరం, కోడలు శ్రీనిధి రంగరాజన్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.