Ram janmabhoomi: అద్వానీ కీలక, ఆసక్తికర వ్యాఖ్యలేంటి ?
రామ జన్మభూమి ( Ram janmabhoomi ) అనగానే గుర్తొచ్చే పేరు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ. ఆగస్టు 5 రామాలయ శంకుస్థాపన మహోత్సవం సందర్భంగా ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్న ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామాలయానికి..అద్వానీకున్న సంబంధమేంటి ?
రామ జన్మభూమి ( Ram janmabhoomi ) అనగానే గుర్తొచ్చే పేరు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ. ఆగస్టు 5 రామాలయ శంకుస్థాపన మహోత్సవం సందర్భంగా ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్న ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామాలయానికి..అద్వానీకున్న సంబంధమేంటి ?
హిందువుల చిరకాల స్వప్నం అయోధ్యలో రామాలయ నిర్మాణమే ( Ayodhya Rama mandiram ) ఈ ఆలయ శంకుస్థాపనకు మరికొన్ని గంటల వ్యవధి మాత్రమే మిగిలింది. దేశవ్యాప్తంగా ఆతృతతో ఎదురుచూస్తున్న చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్య రామ జన్మభూమి ( Ayodhya Ram janmabhoomi ) అంటేనే గుర్తొచ్చే బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ ( Bjp senior leader Lk Advani ) ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నారు ఈ కార్యక్రమానికి. ఈ నేఫధ్యంలో ఆయన కీలకమైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామాలయ నిర్మాణ పోరాట చరిత్రలో ముందుభాగంలో ఉన్న నేత అద్వానీ. రధయాత్ర ద్వారా కరసేవకుల్ని చైతన్యపర్చింది ఆయనే. అయోధ్యలో రామాలయ నిర్మాణ ప్రాధాన్యతను ప్రాచుర్యంలోకి తెచ్చింది ఆయనతో పాటు మరి కొంతమంది సీనియర్ బీజేపీ నేతలే. అందుకే ఆయనీ వ్యాఖ్యలు చేశారు. Also read: Mig 23: ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి సిద్ధం
అద్వానీ ఏమన్నారంటే..
తన కల సాకారమైన రోజు ఇదేనని బీజేపీ నేత అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ( Prime minister narendra modi ) భూమి పూజ చేయడం చారిత్రాత్మకమన్నారు. రామమందిర నిర్మాణం ప్రతి భారతీయుడికి ఓ ఉద్వేగపూరిత క్షణమని, బీజేపీ కల అని ఆయన అన్నారు. రధయాత్ర ( Radhayatra ) ద్వారా రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొనడం ద్వారా తన కర్తవ్యాన్ని నిర్వర్తించానంటూ ఉద్వేగభరితమయ్యారు. రాముడు ఒక ఆదర్శమని..రామమందిర నిర్మాణం రామరాజ్యానికి ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ రామాలయ శంకుస్థాపన కార్యక్రమానికి అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నేతలు ఆన్ లైన్ ద్వారా పాల్గొననున్నారు. Also read: Ram mandir: భూమి పూజ తొలి ఆహ్వానం అందుకుంటున్న ఇక్బాల్ ఎవరు ?