ఓఎల్ఎక్స్..ఏదైనా అమ్మేస్తారిక్కడ. ఆ ప్లాట్ ఫారమ్ అలాంటిది. అందుకే అనుకుంటా ఓ ప్రబుద్ధుడు ఏకంగా మిగ్ 23 ( Mig 23 ) విమానాన్ని అమ్మకానికి పెట్టేశాడు. అసలు విమానం అమ్మకానికి పెట్టడమేంటి..అది కూడా ఓఎల్ఎక్స్ లో...ఇవీ వివరాలు
ఓఎల్ఎక్స్ ( OLX ) అనగానే మనకు మొబైల్ ఫోన్లు, బైకులు, ఫర్నీచర్ వంటి వస్తువులు సెకండ్ హ్యాండ్ లో అమ్మే ప్లాట్ ఫారమ్ గా పరిచితం. అలీగఢ్ యూనివర్సిటీ ( Aligadh University ) లో ఉన్న యుద్ద విమానం మిగ్ 23నే ఓ ప్రబుద్ధుడు ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టేశాడు. ధర ఎంతో తెలుసా..9 కోట్ల 99 లక్షలు మాత్రమే. కార్గిల్ యుద్ధంలో ( Kargil War ) పాల్గొన్న మిగ్ 23 విమానాన్ని 2009లో అలీగఢ్ విశ్వవిద్యాలయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వయంగా బహుమానంగా అందించింది. క్యాంపస్ విద్యార్ధుల పరిశోధనలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఐఏఎఫ్ దీన్ని బహుకరించింది. ఇదీ మిగ్ 23 విమానం బ్యాక్ గ్రౌండ్.
ఇంతటి చరిత్ర కలిగిన ఈ మిగ్ 23 విమానాన్ని ( Mig 23 ) ఓఎల్ఎక్స్ ( OLX ) లో అమ్మకానికి ఉంచడంతో సంచలనమవుతోంది వ్యవహారం. యూనివర్శిటీ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఎవరో ఇలా చేశారని..యూనివర్సిటీకు చెందినవారెవరూ ఇలా చేయలేదని యూనివర్సిటీ ప్రొక్టార్ ప్రొఫెసర్ మొహమ్మద్ వసీం అలీ తెలిపారు. ఇది కచ్చితంగా ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా ఆయన అభివర్ణించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టామని..చేసిందెవరో తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా విమానం ఫోటోను వెబ్ సైట్ నుంచి తొలగించేశారు. Also read: Corona update: దేశవ్యాప్తంగా తగ్గుతున్నడెత్ రేట్, పెరుగుతున్న రికవరీ