LS Elections counting Checking process 2024: దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం నాలుగురాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే ఏడు దశల్లో కూడా ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతలను చేపట్టింది. ఇదిలా ఉండగా.. కేంద్రం, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే.. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతలను చేపట్టారు. ముఖ్యంగా దేశంలో రెండు తెలుగు స్టేట్స్  ల ఫలితాలపై ఇప్పుడు నరాలు తెగె ఉత్కంఠ నెలకొంది.  ఏపీలో కొన్ని ప్రాంతాలలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ఎన్నికల  సంఘం తీవ్రంగా పరిగణించింది. ఎక్కడైతే గొడవలు జరిగాయో.. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతలను చేపట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Cop cpr on monkey: హ్యాట్సాఫ్ సార్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీసు.. వీడియో వైరల్..


ఇదిలా ఉండగా... ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే విడుదయ్యాయి.  కొన్నిసర్వేసంస్థలు కొన్ని పార్టీలు అధికారంలోకి వస్తాయని, మరికొన్ని సర్వే సంస్థలు ఇతర పార్టీలు అధికారంలోకి వస్తాయని తెల్చిచెప్పారు. ఈ క్రమంలో.. ఎక్కడో చూసిన అందరు జూన్ 4 ఎన్నికల ఫలితాల గురించి చర్చించుకుంటున్నారు. చిన్నా , పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది.. ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారో తెలుసుకొవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొందరు టీవీలు, మరికొందరు ఫోన్ లలో వచ్చే అప్ డేట్ లను ఫాలో అవుతుంటారు. ఈసారి ప్రత్యేకంగా ఎన్నికల ఫలితాలను కొన్ని సినిమా థియేటర్లు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి.


కొంత మంది మాత్రం ఎన్నికల ఫలితాలను ఇంకా ఖచ్చితంగా ఎలా తెలుసుకొవాలో  ఆరా తీస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్రాంతంనుంచి అధికారులు రౌండ్ రౌండ్ కు ఎన్నికల ఫలితాలను చెప్తుంటారు. ఏ పార్టీకీ ఎంత మెజారీటీ వచ్చింది. ఏ పార్టీకి చెందిన అభ్యర్థి ఎన్ని ఓట్లతో ఆధిక్యంలో ఉన్నాడనే దానిపై, కౌంటింగ్ కేంద్రం నుంచి ఎన్నికల అధికారులు నిరంతరం అప్ డేట్ లు ఇస్తుంటారు. అన్ని మీడియా సంస్థలు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లను ఫాలో అవుతాయి. ఈ వెబ్ సైట్ ను ఇప్పుడు ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.



వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు..


- కేంద్ర ఎన్నికల సంఘం అఫిషియల్ వెబ్‌సైట్ https://www.eci.gov.in/ ను ఓపెన్ చేయాలి.
- సదరు పేజీ ఓపెన్ అయిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ 2024 ఉన్న చోట క్లిక్ చేయాలి.
- పార్లమెంటరీ నియోజకవర్గాలు అని ఉన్న చోట లింక్ క్లిక్ చేయాలి.
- ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ఫలితాలు వెల్లడి అవుతాయి.
-  అఫిషియల్ సైట్ లో..  స్క్రీన్‌పై ఏ అభ్యర్థి లీడింగ్‌లో , ఏ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు అనేది తెలుస్తుంది.
-  ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం తెలంగాణపై క్లిక్ చేయాలి.
- బీహర్ ఎన్నికల రిజల్ట్స్ కోసం బీహర్ అని ఉన్న దగ్గర క్లిక్ చేయాలి.
- ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి, వారు నియోజకవర్గంలో ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవచ్చు.


Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..



మొబైల్ యాప్ ద్వారా ఫలితాలు..


 మొబైల్ యాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. Voter Helpline App అనే యాప్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్ అందుకోవచ్చు. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు అప్‌డేట్ చేసిన డేటా ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. దీన్ని స్మార్ట్ ఫోన్ యూజర్లు.. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి ఈ Voter Helpline App ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక మంగళవారం ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter