Lok Sabha Election Results 2024: 2024లో దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్టీయే కూటమి దాదాపు 300 సీట్లకు చేరువలో వచ్చింది. అయితే మెజారిటీ సర్వే సంస్థలు బీజేపికి 350 నుంచి 400 సీట్లకు వస్తాయని చెప్పినా.. జీ న్యూస్ AI సంస్థ  చెప్పినట్టే దాదాపు ట్రెండ్ కూడా అదే విధంగా ఉంది.జీ న్యూస్ AI సంస్థ బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే 305-315 సీట్లు వస్తాయని పేర్కొంది. అదే విధంగా ఎన్టీయే కూటమి దాదాపు 300 సీట్ల వరకు సాధిస్తోంది. మరోవైపు INDIA కూటమి 180-195 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇతరులకు 38-52 సీట్లు వస్తాయని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీ న్యూస్ AI సంస్థ చెప్పినట్టు నెంబర్స్ కూడా అదే విధంగా ఉండటం మరోసారి జీ న్యూస చెప్పిన సర్వే పై అందరు మాట్లాకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్టీయేకు 12-16 సీట్లు వస్తాయని చెప్పారు. చెప్పినట్టే దాదాపు 15-18 సీట్లు గెలుస్తోంది. అటు తెలంగాణలో బీజేపీకి 4-6 సీట్లు వస్తాయని లెక్క తేల్చింది. కానీ బీజేపీ మాత్రం దాదాపు 8 సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది.  మరోవైపు హర్యానాలో కూడా NDA కు 3- 5 సీట్లకు గాను బీజేపీ కూటమి ఇక్కడ 4 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో 2-3 సీట్లు వస్తాయని చెప్పిన జీ న్యూస్ ఏఐ సంస్థ ప్రకారం 4 సీట్లు లీడ్ లో ఉంది.


మొత్తంగా లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆశించిన సీట్లు రాకపోయినా.. మూడోసారి అధికారం చేపట్టం మాత్రం ఖాయమనే చెప్పాలి. మొత్తంగా మెజారిటీ మార్క్ 272 సీట్లకు గాను బీజేపీ 294 సీట్లలో ఆధిక్యంలో ఉంది. మొత్తంగా బీజేపీ ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజాస్థాన్ రాష్ట్రాల్లో పెద్ద దెబ్బే తగిలిందని చెప్పాలి. మొత్తంగా ట్రెండ్ ను బట్టి ఎన్టీయే మొత్తంగా ఎన్ని సీట్లు సాధిస్తుందనేది చూడాలి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook