Lok Sabhas Polls 2024:  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొంది. ఏడు విడతల్లో దాదాపు నెలన్నర వ్యవధిలో ఈ ఎన్నికల క్రతువు జరగనుంది. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మరో ఐడు విడతల్లో 18వ లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల దేశంలోని 543 లోక్‌సభ సీట్లకు ఎన్నికల కమిషన్ 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తూ ఉండటంపై అబ్బా.. ఇన్ని విడతాల అని ప్రజలు,  రాజకీయ పార్టీలు ఉసురుమంటున్నా సందర్భాలున్నాయి. గత 2019.. 17వ లోక్ సభ ఎన్నికలు కూడా ఏడు విడతల్లో జరిగింది. కానీ భారత పార్లమెంట్‌కు జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికలు 68 విడతల్లో జరిగిన విషయం చాలా మందికి తెలియదు. అవును 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు నాలుగు నెలల పాటు సుదీర్ఘంగా ఈ ఎన్నికల క్రతువు జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1951లో అప్పట్లో దేశ వ్యాప్తంగా 68 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 97 కోట్ల మంది ఎన్నికల ప్రక్రియలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కానీ తొలి లోక్ సభ ఎన్నికల్లో కేవలం 17.6 లక్షల మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సహా 14 జాతీయ పార్టీలు.. చిన్నా చితకా కలిపి 53 పొలిటికల్ పార్టీలు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. అంతేకాదు  దేశ వ్యాప్తంగా 1874 మంది అభ్యర్ధులు ఆ ఎన్నికల్లో పోటీ చేసారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ.. 'నయా హిందూస్థాన్ జిందాబాద్' నినాదంతో ఎన్నికల బరిలో దిగింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కానీ అప్పట్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి డిసెంబర్ 16 నుంచి 25 వరకు దాదాపు పది రోజుల పాటు ఎన్నికల జరిగాయట. ఇక దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 26 మొదటి విడత ఎన్నికల ప్రక్రియ మొదలైంది. జూన్ 1న ఏడో విడత ఎన్నికలతో ఈ ఎన్నికల క్రతువు పూర్తవుతోంది. జూన్ 4 తేదిన ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.


Also Read: Revanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు 'గాడిద గుడ్డు' తప్ప: రేవంత్‌ రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter