Lok Sabha Speaker Om Birla urges MPs: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ( Coronavirus) వినాశనం కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిదులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కరోనా బారిన పడి కన్నుమూశారు. ఈ క్రమంలోనే మరో 15 రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ( Parliament Session) ప్రారంభం కానున్నాయి.  సెప్టెంబరు‌ 14 నుంచి అక్టోబరు 1 వరకు పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే.. సమావేశాలు ప్రారంభమవ్వడానికి 72గంటల (మూడు రోజులు) ముందు ఎంపీలంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని, నెగెటివ్‌ వచ్చినవారే
హాజరుకావాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ( Om Birla ) శుక్రవారం పేర్కొన్నారు. Also read: 
Tamil nadu: కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ కరోనాతో మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో.. పార్లమెంట్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్‌, డీఆర్డీవో, ఢిల్లీ ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోకి ప్రవేశించే ఎంపీలు, ఉభయసభల సచివాలయ సిబ్బంది, వివిధ మంత్రిత్వశాఖల అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. సమావేశాల సందర్భంగా సభ్యులెవ్వరూ ఒకరిని ఒకరు ముట్టుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.  Also read: Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర


Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు