Tamil nadu: కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ కరోనాతో మృతి

సామాన్యులతో పాటు ప్రముఖులు, సినీ, రాజకీయ నేతలు కరోనా వైరస్ ( Corona virus ) కు బలవుతున్నారు. కొంతమంది కరోనా బారిన పడితే..మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తాజాగా తమిళనాడు ( Tamil nadu ) కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ మృతి చెందారు.

Last Updated : Aug 28, 2020, 09:56 PM IST
Tamil nadu: కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ కరోనాతో మృతి

సామాన్యులతో పాటు ప్రముఖులు, సినీ, రాజకీయ నేతలు కరోనా వైరస్ ( Corona virus ) కు బలవుతున్నారు. కొంతమంది కరోనా బారిన పడితే..మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తాజాగా తమిళనాడు ( Tamil nadu ) కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ మృతి చెందారు.

కరోనా వైరస్ కారణంగా మరో ప్రముఖ రాజకీయ నేత మృతి చెందారు. తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ ( Congress Mp ) హెచ్ వసంతకుమార్ ( H Vasantha kumar ) కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మరణించారు. ఆగస్టు పదవ తేదీన చికిత్స కోసం చెన్నై ( Chennai ) లోని అపోలో ఆసుపత్రిలో చేరారు ఎంపీ వసంతకుమార్. ప్రస్తుతం కన్యాకుమారి ( kanyakumari mp ) స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్న ఆయన..గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. వసంత్ కుమార్ మరణం పట్ల పలువురు రాజకీయనేతలు, కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Pm Narendra modi ), కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ( Congress leader Rahul Gandhi ) లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వసంత్ మరణం తనను వేదనకు గురిచేసిందని...ఎప్పుడు కలిసినా తమిళనాడు ( Tamil nadu ) అభివృద్ధి గురించి మాట్లాడేవారని మోదీ గుర్తు చేసుకున్నారు. ఎంతో ప్రజాసేవతో అందరినీ చూరగొన్న నాయకుడు వసంత్ కుమార్ అని రాహుల్ గాంధీ తెలిపారు. వసంత్ కుమార్ రాజకీయనేతే కాకుండా..పారిశ్రామికవేత్త కూడా. వసంత్  అండ్ కో పేరుతో ఛైన్ స్టోర్స్, వసంత్ టీవీ కూడా నిర్వహిస్తున్నారు. అటు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ( Telangana governor ) కు ఈయన బంధువు అవుతారు. Also read: Indian Railways: మణిపూర్ లో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్

Trending News