Richest MP List: లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయం సాధించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. మరోవైపు ఈసారి లోక్‌సభలో కోటీశ్వరులు ప్రవేశించిన పరిస్థితి ఉంది. గుంటూరు లోక్‌సభ గడ్డపై విజయం సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనికుడిగా నిలిచారు,


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18వ లోక్‌సభలో అపర కోటీశ్వరులు చాలామంది కన్పిస్తున్నారు. దేశంలో కొత్తగా ఎన్నికైన టాప్ 10 అత్యధిక ధనికుల్లో ముగ్గురు తెలుగు రాష్ట్రాలకు చెందినవాళ్లే కన్పిస్తున్నారు. దేశంలోని ధనిక ఎంపీల్లో మొదటి స్థానంలో నిలిచారు గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు నుంచి 3.3 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్థులు 5,700 కోట్లని ప్రకటించారు.


తెలంగాణలోని చేవెళ్ల నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి దేశంలో రెండవ ధనిక ఎంపీగా ఉన్నారు. ఈయన తన ఆస్థుల విలువ 4,568 కోట్లుగా ప్రకటించారు. 1.5 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు. 


దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నుంచి 30 వేలకు పైగా మెజార్టీతో గెలిచారు. ఈయన ఆస్థుల విలువ 1241 కోట్లుగా ఉంది. 


ఏపీకు చెందిన మరో అపర కోటీశ్వరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి తెలుగుదేశం తరపున ఎంపీగా విజయం సాధించారు. ఈయన ఆస్థుల విలువ 716 కోట్లుగా ఉంది. దేశంలోని ధనిక ఎంపీల్లో ఒకరిగా ఉన్నారు. 2.3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 


ఇక మధ్యప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్ధిగా గెలిచిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆస్థుల విలువ 424 కోట్లు. 5 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.


ఇక బాలీవుడ్ వెటరన్ నటి, డ్రీమ్ గర్ల్‌గా పేరు సంపాదించుకున్న హేమ మాలిని మధుర లోక్‌సభ నుంచి బీజేపీ ఎంపీగా 2.8 లక్షల మెజార్టీతో గెలిచారు. ఈమె ఆస్థుల విలువ 278 కోట్లు. దేశం మొత్తం మీద ఇలా అపర కోటీశ్వరులైన ఎంపీలు చాలా మందే ఉన్నారు. 


Also read: Ayodhya Loss Factors: అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది, రామమందిరం ఓట్లు రాల్చలేదా



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook