Delhi Lockdown:లాక్‌డౌన్ భయంతో ఢిల్లీ మార్కెట్‌లో పోటెత్తిన జనం
Delhi Lockdown: ఓ వైపు లాక్‌డౌన్ ప్రకటన వెలువడిందో లేదో జనం ఒక్కసారిగా మార్కెట్‌లో పడ్డారు. నిత్యావసరాలు, మాల్స్, మద్యం దుకాణాల వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. లాక్‌డౌన్ వేళ అన్నీ సిద్ధంగా ఉంచుకుకోవాలనే ఆలోచనే దీనికి కారణమని తెలుస్తోంది.
Delhi Lockdown: ఓ వైపు లాక్‌డౌన్ ప్రకటన వెలువడిందో లేదో జనం ఒక్కసారిగా మార్కెట్‌లో పడ్డారు. నిత్యావసరాలు, మాల్స్, మద్యం దుకాణాల వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. లాక్‌డౌన్ వేళ అన్నీ సిద్ధంగా ఉంచుకుకోవాలనే ఆలోచనే దీనికి కారణమని తెలుస్తోంది.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) దేశమంతా భారీగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవడమే కాకుండా మరణాలు కూడా పెరుగుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. ఢిల్లీలో రోజువారీ కేసులు 25 వేలకు చేరుకోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నైట్ కర్ఫ్యూతో(Night Curfew)ఏ విధమైన ప్రయోజనం లేకపోవడంతో కఠిన నిర్ణయానికి దిగింది. ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) ప్రకటన విడుదల చేశారు.
ఇటు లాక్‌డౌన్ ( Delhi lockdown) ప్రకటన విడుదలైందో లేదో..జనం ఒక్కసారిగా మార్కెట్‌లో వచ్చిపడ్డారు. మూకుమ్మడిగా కొనుగోళ్లకు దిగారు.ఢిల్లీ నగరంలో ఒక్కసారిగా నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు ఎగబడ్డారు. పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, మాల్స్ వద్ద భారీ క్యూలు ( Long Queues and rush in market) దర్శనమిచ్చాయి.లాక్‌డౌన్ సమయంలో బయటకు రాకుండా ఉండాలంటే ఇంట్లో అన్నీ సిద్ధంగా ఉండాలని భావించిన ప్రజలు ఒక్కసారిగా షాపింగ్‌కు పోటెత్తారు. ఏడాది తరువాత కూడా పరిస్థితులు మారలేదని..ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వాన్ని నమ్మలేమని ప్రజలంటున్నారు. అందుకే నిత్యావసరాల్ని పెద్దఎత్తున కొనుగోలు చేసేందుకు వచ్చామంటున్నారు.
ఇక ప్రజల్లో నెలకొన్న భీతిని క్యాష్ చేసుకునేందుకు కొందరు వ్యాపారస్తులు ప్రయత్నిస్తున్నారు. చాలా షాపుల్లో వస్తువుల ధరలు ఒక్కసారిగా పెంచేశారు. గత ఏడాది ఇలాగే శానిటైజర్లు, ఫ్లోర్ క్లీనర్ల రేట్లు పెరిగిపోయాయి. ఏలుక్కాయలు వంటివైతే స్టాక్ లేదంటున్నారు. లాక్‌డౌన్ (Lockdown fear in public) అంటేనే భయంగా ఉందని గృహిణులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి వారిని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ లాక్‌డౌన్ పొడిగిస్తే మధ్యతరగతి పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also read: Remdesivir Usage: రెమ్‌డెసివిర్ ప్రాణాలు నిలబెట్టే ఔషదం కాదంటున్న కేంద్ర ఆరోగ్య శాఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook