హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో వ‌రుస భూకంపాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు కరోనా  మరోవైపు వరుస భూకంపాలతో మరోనా అనే విధంగా ఉందంటూ ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. సోమవారం మధ్యాహ్నం 1:05 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు న‌మోద‌య్యాయని, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.1గా ఉందని, హర్యానా సమీపంలో  గురుగ్రామ్‌కు స‌మీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Reddy: Bandi Sanjay: తెలంగాణ సర్కారుపై కేంద్రానికి ఫిర్యాదు


మరోవైపు‌ హర్యానాలోనూ పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభ‌వించడంతో ప్రజల ఉరుకులు తీస్తూ ఇళ్ల నుండి బయటకు వచ్చారు. కాగా త కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ కేంద్రాల్లో గత రెండు నెలల్లో తరచూ భూకంపాలు భ‌యోత్పాతాలు సృష్టిస్తున్నాయి. ఇదిలాఉండగా ఇప్పటికే కోవిడ్-19 భయంకరంగా విజృంభిస్తుండడంతో  వణికిపోతున్న ఢిల్లీ ప్ర‌జ‌లు భూకంపాలతో మరో ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన ఏప్రిల్, మే నెలల్లో ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మ‌రోసారి భూప్ర‌క‌పంన‌లు వెలువడడంతో, వరస భూ ప్రకంపనలతో ఢిల్లీ వాసుల్లో తీవ్ర కల‌వ‌రం మొద‌లైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళలకు గురువవుతున్నారు. Read also : Monsoon updates: కేరళను తాకిన రుతుపవనాలు.. విస్తారంగా కురుస్తున్న వర్షాలు