మా నుండి మీరు తప్పించుకోలేరు.. కేజ్రీవాల్

కరోనా మహమ్మారి భయంకరంగా విజృంభిస్తోన్న తరుణంలో ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోవిడ్ లక్షణాలున్న వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.

Last Updated : Jun 6, 2020, 09:48 PM IST
మా నుండి మీరు తప్పించుకోలేరు.. కేజ్రీవాల్

ఢిల్లీ: కరోనా మహమ్మారి భయంకరంగా విజృంభిస్తోన్న తరుణంలో ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఢిల్లీ సీఎం (Arvind Kejriwal) అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోవిడ్ లక్షణాలున్న వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. కాగా ఢిల్లీలో కొన్ని ఆస్పత్రులు COVID-19 రోగులకు అనుమతిని నిరాకరిస్తున్నాయన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బ్లాక్-మార్కెటింగ్ చేయాలని ప్రయత్నిస్తే మీరు తప్పించుకోలేరని కేజ్రీవాల్ అన్నారు. కాగా కొద్దీ రోజుల్లోనే ఈ సమస్యకు పరిష్కార మార్గం అన్వేషిస్తున్నామని, పడకలు అందుబాటులో ఉన్నప్పటికీ  కరోనా పాజిటివ్ రోగులను నిరాకరిస్తున్న వారిపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 10Th class exams: తెలంగాణ: పదో తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా

Also Read: రణవీర్ పై గుస్సా అయిన దీపికా పదుకొనే..

మరోవైపు ఢిల్లీ సీఎం మీడియాతో మాట్లాడుతూ. వేలాది మంది లక్షణాలు లేనప్పటికీ పరీక్షల నిర్వహించడం వల్ల ఆసుపత్రుల వద్ద సామాజిక దూరం పాటించలేరని, తద్వారా ఢిల్లీలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ  దెబ్బ తినే అవకాశముందని, కాగా లక్షణాలను ఉన్న వారికి మాత్రమే పరీక్ష చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో శుక్రవారం 1,330 కొత్తగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకు ఢిల్లీలో COVID-19 సంఖ్య 26,000 ను చేరుకుందని, దీని బారిన పడి మరణించిన వారి సంఖ్య 708కు చేరిందని అధికారులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News