Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, మరో ఐదు రోజులుల ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఓ వైపు, రుతు పవనాల ప్రభావం మరోవైపు వెరసి తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజుల్నించి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరో 5 రోజులు కొనసాగవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడి ఉంది. మరోవైపు ఉపరితల ద్రోణి, రుతు పవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమైంది. అరేబియా, బంగాళాఖాతంలో మోస్తరు వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నా రాష్ట్రమంతా పరిస్థితి ఒకేలా లేదు. కొన్ని ప్రాంతాల్లో పగలు ఎండలు దంచి కొడుతూ ఉక్కపోత బాధిస్తోంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనానికి తోడుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రుతు పవనాల ప్రభానం ఇంకా కన్పిస్తోంది. ఫలితంగా తెలంగాణలో గత రెండ్రోజుల్నించి మోస్తరు లేదా భారీ వర్షాలు పడుతున్నాయి. అక్టోబర్ 1 వరకూ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఖమ్మం, నల్గొండ, కామారెడ్డి, సూర్యాపేట, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ అయింది.
మరోవైపు ఏపీలో సైతం గత రెండ్రోజుల్నించి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో ఐదు రోజులు ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక తిరుపతి, అన్నమయ్య, కాకినాడ, ఏలూరు, అనకాపల్లి, చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.
అదే విధంగా కడప, ప్రకాకం, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, నంద్యాల, బాపట్ల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో కూడా తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు పడవచ్చు.
Also read: Mission Venus: త్వరలో శుక్రగ్రహంపై ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో, రెండు పేలోడ్లు రెడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook