Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి తోడు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా ఈ నెల 20 వరకూ భారీ వర్షాలు కురవనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్, నికోబార్ దీవులకు ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఆ తురవాత పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఏపీ తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆ తరువాత ఉత్తర, ఈశాన్య దిశగా కదిలి ఈ నెల 17 నాటికి తీరానికి చేరుకోనుంది. దీనికి తోడుగా ఉన్న మరో ఉపరితల ఆవర్తనం నుంచి అల్పపీడం వరకూ ద్రోణి విస్తరించి ఉన్నందున రానున్న 3-4 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో ఉరుములు, మెరుపులు పడే అవకాశాలున్నాయి. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.


బంగాళాఖాతంలో బలపడనున్న వాయుగుండం కారణంగా ఏపీతో పాటు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరో 3-4 రోజులు తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగనున్నందున ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో 27 జిల్లాల్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే నాగపట్నం, కడలూరు, అరియలూరు, తంజావూరు, మైలాడుతురై, తిరువారూర్ జిల్లాల్లో స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. 


Also read: Driving License Rules: డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందవచ్చు, కొత్త నిబంధనలు జారీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook