LPG New Rules | మీరు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ( LPG ) సిలిండర్ వాడే వినియోగదారులు అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. నవంబర్ 1వ తేదీ నుంచి  ఆయిల్ కంపెనీలు కొత్త డిలవరీ రూల్స్ ను ప్రవేశపెట్టనున్నాయి. దీని ప్రకారం ఇకపై మీరు గ్యాస్ సిలిండర్ హోమ్ డిలవరీ స్వీకరించాలి అనుకుంటే మీరు తప్పకుండా మీ మొబైల్ నెంబర్ పై వచ్చే ఓటీపి డిలవరీ బాయ్ తో షేర్ చేయాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | AP Covid-19 Updates: ఏపీలో రికార్డు స్థాయిలో సాంపిల్స్ పరీక్షలు


నవంబర్ 1వ తేదీ నుంచి మీరు గ్యాస్ బుక్ చేసే ముందు కొత్త రూల్ తెలుసుకొని ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అవ్వకపోతే మీకు గ్యాస్ సిలిండర్ డిలివరీ చేసే అతను మీకు డిలవరీ ఇచ్చే టైమ్ లో అతని వద్ద ఉన్న యాప్ లో మీ నెంబర్ అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇకపై మీ మొబైల్ నెంబర్ మీరు డిలవరీ బాయ్ ద్వారా కూడా అప్డేట్ చేయవచ్చు.



Also Read | Ravan On Ambulance: రావణుడు యాంబులెన్స్ ఎక్కాడు..పాపం పుష్పక విమానం ఏమైందో ఏమో! 


కొత్తగా వచ్చిన ఈ సిస్టమ్ అంటే డిలవరీ ఆథెంటికేషన్ కోడ్ ( DAC) నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. గ్యాస్ బుక్ చేయగానే మీకు ఒక ఓటీపి ( OTP ) వస్తుంది. దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకుని డిలవరీ బాయ్ తో షేర్ చేయాలి. ఈ కొత్త విధానాన్ని ప్రస్తుతం 100 నగరాలతో ప్రారంభించిన తరువాత ఇతర నగరాలకు విస్తరించనున్నారు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR