LPG Distributor Commission: ఎల్‌పీజీ గ్యాస్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ల కమీషన్ ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనంది. ఒక్కో సిలిండర్ పై డిస్ట్రిబ్యూటర్ కమీషన్ ను రూ. 73 కు పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. అయితే గత ఏడాది మే నెల నుంచి డిస్ట్రిబ్యూటర్ కమీషన్ ను రూ. 64.84గా నిర్ణయించింది కేంద్ర సర్కారు. ఇదే కమీషన్ గతేడాది కాలంగా కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు దాన్ని పెంచేందుకు మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ నెల 3న (అక్టోబరు 3) కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మంత్రిత్వ శాఖకు లేఖ రాశాయి. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్ కమీషన్ ను ఇప్పుడు రూ. 73 కు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఈ కమీషన్ పెంపు కారణంగా వంట గ్యాస్ ధర పెరగడం కానీ.. సామాన్యులపై ఎలాంటి భారం పడే విధంగా గ్యాస్ ధరలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్ కమీషన్ పెరిగిన క్రమంలో వినియోగదారులు ఎవరూ గ్యాస్ ధర కంటే ఎక్కువ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రజలంతా గుర్తు ఉంచుకోవాల్సిన విషయం. 


డిస్ట్రిబ్యూటర్ కమీషన్ ను కేంద్రం పెంచిన క్రమంలో గ్రహోపకరణాలకు వినియోగించే 14.2 గ్యాస్ సిలిండర్ పై రూ. 73.08 గా ఉంది. వాటిలో రూ. 39.65 ఎస్టాబ్లిష్ మెంట్ ఛార్జీలు, డెలివరీ ఛార్జీలు అంతర్లీనం అయి ఉంటాయి. వంట గ్యాస్ వినియోగదారులు డెలివరీ సమయంలో రూపాయి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. 


అదే విధంగా 5 కిలోల చిన్న సిలిండర్ పై డిస్ట్రిబ్యూటర్ కమీషన్ ను రూ. 39.65కు పెంచగా.. అందులో రూ. 19.82 ఎస్టాబ్లిష్ మెంట్ ఛార్జీలు, డెలివరీ ఛార్జీలు రూ. 16.72 ఉన్నాయి. 


Also Read: Kishan Reddy: దారుసలం వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నారు.. ఎందుకంటే..?: కిషన్ రెడ్డి  


తాజాగా LPG గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూషన్ కమీషన్ పెంచడంతో పాటు డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ పంపిణీ కమీషన్ కోసం కొత్త పద్ధతిని నిర్ణయించే అధ్యయనానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇదే విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పొందుపరిచి ఉంది. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల సహా ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరడం వల్ల వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం ఇటీవలే సవరించింది. 
 


మరో రూ.100 సబ్సిడీ..
సామాన్యుడికి ఇటీవలే మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అక్టోబరు 4న సమావేశమైన కేంద్ర క్యాబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద అందజేసే ఒక్కో సిలిండర్ పై అదనంగా మరో రూ. 100 సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే ఆగస్టు 29న వంట గ్యాస్ పై రూ. 200 తగ్గించగా.. తాజాగా సవరింపుతో మొత్తంగా రూ. 300 సబ్సిడీ ఇచ్చినట్లైంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 9.5 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ను ఇప్పుడు రూ. 603 ధరకే విక్రయిస్తున్నారు. ఇంతకు ముందు ఈ సిలిండర్ ను రూ. 903కి వినియోగదారులకు అందజేసే వారు.


Also Read: Radish Health Benefits: ముల్లంగి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook