LPG Price Change: ఎల్బీజీ గ్యాస్ సిలెండర్ ధరల్లో మార్పు, ఇవాళ్టి నుంచి కొత్త ధరలు
LPG Price Change: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు అప్డేట్. ఇవాళ్టి నుంచి ఎల్పీ గ్యాస్ సిలెండర్ ధరల్లో మార్పు వచ్చింది. కొత్త ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు ఇవాళ్టి నుంచి ఇలా ఉండనున్నాయి.
LPG Price Change: పెట్రోలియం కంపెనీలు ప్రతి నెలా ఎల్పీజీ గ్యాస్ ధరల్ని సమీక్షిస్తుంటాయి. ఒక్కోసారి డొమెస్టిక్ గ్యాస్ ధరలు, ఒక్కోసారి కమర్షియల్ గ్యాస్ ధరలపై నిర్ణయం తీసుకుంటుంటాయి. పరిస్థితిని బట్టి గ్యాస్ ధరల్ని పెంచడం లేదా తగ్గడం చేస్తుంటాయి. ఇవాళ్టి నుంచి దేశంలో ఎల్పీజీ గ్యాస్ ధరలు తగ్గడం విశేషం.
కొత్త ఏడాది 2024 ప్రారంభమౌతూనే ఎల్పీజీ గ్యాస్ ధరలకు సంబంధించి శుభవార్త అందించాయి పెట్రోలియం కంపెనీలు. ఇవాళ్టి నుంచి ఎల్బీజీ గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల ధరలో స్వల్ప మార్పు కన్పించనుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 2024 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గుతాయని ఆశించారు. కానీ ఈ తగ్గుదల ఈసారి కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరల్లోనే కన్పించనుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండటం లేదు.
19 కిలోల కమర్షియల్ ఎల్బీజీ గ్యాస్ సిలెండర్ స్వల్పంగా 1.50 రూపాయలు తగ్గింది. మొన్నటి వరకూ 1757 రూపాయలున్న19 కిలోల గ్యాస్ సిలెండర్ ధర ఇవాళ్టి నుంచి 1755.50 రూపాయలైంది. అంటే ఒక్కో సిలెండర్‌పై కేవలం 1.50 తగ్గింది. ఇది ఢిల్లీలో ధర. కోల్‌కతాలో 19 కిలోల గ్యాస్ సిలెండర్ ధర 1868.50 రూపాయలు కాగా ఇవాళ్టి నుంచి 50 పైసలు పెరిగి 1869 రూపాయలైంది. ముంబైలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర 1710 రూపాయలు కాగా ఇవాళ్టి నుంచి 1708.50 రూపాయలైంది. ఇక చెన్నైలో 1929 రూపాయలకు బదులు ఇవాళ్టి నుంచి 1924.50 రూపాయలకు తగ్గింది. చెన్నై ధరలో4.50 రూపాయలు తగ్గుదల కన్పించింది.
ఇక 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరలో ఏ మార్పు లేదు. ఆగస్టు 30వ తేదీ 2023 నాటికి ఏ ధర ఉందో అదే ధర కొనసాగుతోంది. ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ దర 903 రూపాయలు కాగా ఆగస్టు 2023కు ముందు 1103 రూపాయలుండేది. ఒకేసారి 200 రూపాయలు తగ్గించాక అదే ధర కొనసాగుతోంది. కోల్‌కతాలో డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర 929 రూపాయలు కాగా, ముంబైలో 902.50 రూపాయలు, చెన్నైలో 918.50 రూపాయలుంది.
Also read: Ysrcp Strategy: కాపు ఓట్లపై దృష్టి సారించిన వైసీపీ, వంగవీటి, ముద్రగడ కోసం ప్రయత్నాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook