LPG Price Today: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
LPG 19 Kg Commercial Cylinder Price Cut Rs 36. వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు శుభవార్త. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. వాణిజ్య సిలిండర్ ధర రూ.36 తగ్గింది.
Commercial LPG Cylinder Price reduced by Rs 36: వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు శుభవార్త. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. వాణిజ్య సిలిండర్ ధర రూ.36 తగ్గింది. ఈ ధరలు నేటి నుంచి (ఆగస్టు 1) అమల్లోకి రానున్నాయి. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1976.50కి చేరింది. నిన్నటి వరకు ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2012.50గా ఉంది. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
కోల్‌కతాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.2132గా ఉండగా.. తాజా తగ్గింపుతో దీని ధర రూ.2095.50గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో గతంలో రూ.1972.50గా ఉన్న సిలిండర్ ఇప్పుడు రూ.1936.50కి అందుబాటులోకి వచ్చింది. చెన్నైలో సిలిండర్ ధర రూ.2141కి చేరింది. అంతకుముందు జూలై నెలలో వాణిజ్య సిలిండర్ ధర రూ.8.50 తగ్గించిన విషయం తెలిసిందే. ఈ తగ్గించిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు పేర్కొన్నాయి. దాంతో హోటల్స్, బార్స్, రెస్టారెంట్లు, టీ స్టాల్స్ లాంటి వినియోగదారులకు కాస్త ఉపశమనంగా ఉండనుంది.
వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించిన చమురు సంస్థలు.. డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌ను కొనుగోలు చేస్తే రూ.1053 చెల్లించాల్సి ఉంటుంది. కోల్‌కతాలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1079 ఉండగా.. ముంబై, చెన్నైలో 1052 రూపాయలుగా ఉంది. జూలై 6న దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.50 చొప్పున పెంచారు. అంతర్జాతీయ ఇంధన ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో.. మే నుంచి ఎల్‌పీజీ ధరలు మూడుసార్లు పెరిగాయి. మే 7, జూలై 6, మార్చి 22న సిలిండర్ ధరలు పెరిగాయి.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు ఇవే!
Also Read: Monkeypox Death: భారత్‌లో తొలి మంకీపాక్స్ మరణం.. కేరళలో కలకలం! పాజిటివ్ వచ్చినా చెప్పకుండా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook